వైసీపీని, జగన్ రెడ్డిని నిండా ముంచేస్తున్న సలహాదారుగా ఆ పార్టీ లీడర్ల నుంచి గట్టి ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి తన విచిత్ర వాదనలతో.. … కామెడీ అవుతున్నారు. తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుపై కేసుల విషయంలో ఎప్పుడూ చెప్పే సొల్లు కబుర్లు చాలా చెప్పారు. అదే సమయంలో చంద్రబాబుకు కమ్యూనిస్టులు ఎందుకు మద్దతు పలుకుతున్నారని ప్రశ్నించారు. వారు అమ్ముడుబోయారని ఆరోపించారు.
కానీ సజ్జల రెడ్డికి తెలిసినా తెలియనట్లుగా నటించిన విషయం ఏమిటంటే…. చంద్రబాబుది అక్రమ అరెస్టు అని.. ప్రకటించని పార్టీ లేదు. బీజేపీ కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడు అయిన ఎంపీ కే లక్ష్మణ్ సహా… ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన గిడుగు రుద్రరాజు సహా అందరూ అక్రమ అరెస్టు అని ఖండించారు. కాంగ్రెస్, బీజేపీ,, కమ్యూనిస్టులు… బీఆర్ఎస్ కీలక నేతలు అందరూ ఖండించారు. కానీ సజ్జల రెడ్డికి ఒక్క కమ్యూనిస్టులే ఎందుకు కనిపించారో వారినే ఎందుకు నిందిస్తున్నారో మరి.
కమ్యూనిస్టుల్లో సీపీఐ మాత్రమే ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతోంది. సీపీఎం నేతలు మొదటి నుంచి జగన్ రెడ్డికి అండగా ఉన్నారు. ఆ పార్టీ నేతలు గపూర్ లాంటి వాళ్లు… జగన్ రెడ్డికి ఏకపక్షంగా మద్దతు పలికేవారు. వారు కూడా ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపులు కరెక్ట్ కాదని… జగన్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకున్నాడని అంటున్నారు. అలా మార్పు వచ్చింది.. చంద్రబాబు ఏదో ఇస్తాడని కాదని.. సజ్జల రెడ్డికీ తెలుసు. ఎందుకంటే… వారు ఎంత ఇచ్చారో అనేది కూడా ఆయనకు తెలుసు మరి. మొత్తంగా … తమ చేష్టలను సమర్థించని వారందర్నీ టీడీపీ ఖాతాలో వేస్తున్నారు. అందుకే వైసీపీ ఒంటరి అయింది.