ఆరోగ్య కారణాలతో ఎస్కార్ట్ బెయిల్ పొంది ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఖచ్చితంగా ఆ గడువు ముగిసే రోజున మరో పిటిషన్ విచారణకు వచ్చేలా చేసుకున్నారు. మరో రెండు నెలల పాటు ఎస్కార్ట్ బెయిల్ ఇవ్వాలని ఆయన సీబీఐకోర్టులో పిటిషన్ దాఖుల చేసుకున్నారు. కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నందున వైద్యుల సూచనలు, తదుపరి చికిత్స కోసం రెండు నెలలు అవసరం అని ఆయన చెబుతున్నారు.
గతంలో పొందిన ఎస్కార్ట్ బెయిల్ ప్రకారం మూడో తేదీన ఉదయం పదిన్నర కల్లా జైలులో లొంగిపోవాలి. కానీ మరో రెండు నెలల పిటిషన్ వేసినందున ఆయన మళ్లీ జైలుకెళ్లరు. బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది కాబట్టి అది తేలిన తర్వాతనే వెళ్తారు. అధికారికంగా బెయిల్ రాకపోయినా ఇలాంటి అవకాశాలను విరివిగా ఉపయోగించుకుంటారని చెబుతున్నారు.. వివేకా హత్యకేసులో ఇతర నిందితులు అందరూ జైల్లో ఉన్నారు. అవినాష్ రెడ్డి ఇలా అరెస్ట్ అయిన క్షణంలో అలా బెయిల్ పొందారు. భాస్కర్ రెడ్డి కి.. ఆరోగ్య కారణాలతో బెయిల్ పై బయటకు వచ్చి … పొడిగింపులు కోరుతున్నారు.
వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఈ వారం లేదా వచ్చే వారం జరిగే అవకాశం ఉంది. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాతి రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినా.. మూడు వారాలకు వాయిదా పడింది. మళ్లీ విచారణ తేదీ ఖరారు కావాల్సి ఉంది.