జగన్ రెడ్డి తన గురించి తాను ఏమనుకుంటారో కానీ… ఎస్సీ, ఎస్టీలు మంచి స్కూళ్లలో చదవకూడదన్న పట్టుదలతో… ఓ పథకాన్ని ఆపేసి… దానిపై విద్యార్థులు పోరాడుతూంటే.. సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. కానీ అక్కడా ఎస్సీ, ఎస్టీల పిల్లలకు చేయబోతున్న అన్యాయం గుర్తించి…. గట్టి షాక్ ఇవ్వడంతో ఇప్పుడు మళ్లీ ఆ పథకాన్ని అమలు చేయక తప్పడం లేదు. ఇప్పుడీ విషయం… ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.
బాగా చదివే విద్యార్థులను ఆసక్తిని బట్టి .. ఇష్టమైన స్కూళ్లలో చదువుకునే అవకాశాన్ని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పతకం ఇస్తుంది. వారికి ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇది టీడీపీ ప్రభుత్వం పెట్టిన పథకమే అయినా 2014 తర్వాత పెట్టింది కాదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉంది. అయితే జగన్ రెడ్డి సర్కార్ రాగానే… ఎస్సీ, ఎస్టీ పేదకలకు ఉన్నత , నాణ్యమైన విద్య.. బాగా చదివే పిల్లలను ప్రోత్సహించాల్సిన అవసరం లేదని పథకం తీసేసింది. మద్యలో తీసేయడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు.
ఈ పథకం రద్దు చేయడం వల్ల దాదాపు 50 వేల మంది కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. కోర్టుల్లో కేసులు పడటంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని మధ్యలో ఆపేయటానికి వీలులేదని ఈ పథకాన్ని తప్పక కొనసాగించాలని ఆదేశించింది. అయితే జగన్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడా ఎదురు దెబ్బతప్పలేదు.
పిల్లలు అమ్మఒడి ఇస్తున్నామని కారణం చెప్పి ఈ పథకాన్ని రద్దు చేయాలనుకున్నారు. కానీ… సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదు. అయితే అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయనేది కొంత మందికి ఇప్పటికీ డౌట్. బాగా చదువుకునే ఎస్సీ, ఎస్టీ పిల్లల్ని డిస్ట్రర్బ్ చేసి… వారు ఎదుగకుండా చేసే కుట్రే ఇది. వారి భవిష్యత్ ను నాశనం చేసే కుట్రే. అలా ఎలా చేస్తారో…. ఇలాంటి పాలకుల్ని ఏమంటారో ప్రజలే అర్థం చేసుకోవాలి. చేసిందంతా చేసి… ఎస్సీ, ఎస్టీ మంత్రులతో ఆ పథకం పనికిరానిదని చెప్పిస్తారు. ..అలాంటి రాజకీయం చేసే వారికి ఏదైనా తప్పుగానే అనిపిస్తుంది.