తెలంగాణతో పాటు మరో ఐదు రాష్ట్రాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ పాతస్తీ కేంద్రంగా ఉండే మజ్లిస్… దేశవ్యాప్తంగా ముస్లింలకు తామే ప్రాతినిధ్యం వహిస్తామని అన్ని చోట్లా పోటీ చేస్తోంది. మిజోరం మినహా నాలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తోంది. తెలంగాణలోనూ పోటీ చేస్తోంది. అయితే ఏడెనిమిది స్థానాల్లోనే పోటీ చేస్తుంది. కానీ మధ్యప్రదేశ్, రాజస్ఖాన్, చత్తీస్ ఘడ్లలో మాత్రం పదుల సంఖ్యలో పోటీ చేస్తోంది. గెలవడానికి కాదు.. కాంగ్రెస్ ను ఓడించడానికి.
మధ్యప్రదేశ్, రాజస్ఖాన్, చత్తీస్ ఘడ్ లలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న చోట్ల మజ్లిస్ పోటీ చేస్తోంది. నిజానికి గత కొన్నేళ్లుగా పోటీ చేస్తూనే ఉంది. అయితే ఎక్కడ పోటీ చేసినా కాంగ్రెస్ కు పడాల్సిన ఓట్లను చీల్చడం ద్వారా ఆ పార్టీకి నష్టం చేసి బీజేపీకి మేలు చేస్తున్నారన్న ఆరోపణలు మాత్రం బలంగా వస్తున్నాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి మజ్లిస్ కారణం. బీహార్ లోనూ అంతే అని చెబుతున్నారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు.
మరి తెలంగాలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట్ల ఎందుకు పోటీ చేయడం లేదు. తాము పోటీ చేసే పాతబస్తీలోని 7 నియోజకవర్గాలు మినహా మిగితా స్థానాల్లో అభ్యర్థులను పెట్టడం లేదు. బిఆర్ఎస్ అభ్యర్థులను బలపరచాలని పిలుపునిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ముస్లింలు అధికంగా ఉన్నారు. అయినా పోటీకి పెట్టడం లేదు. పెడితే తమ పార్టీకి ఓట్లు వేస్తారు. అది బీఆర్ఎస్ కు నష్టం చేస్తుంది. కాంగ్రెస్ కు మేలు చేస్తుంది.
అసలు హిందూ వ్యతిరేక భావజాలమున్న బీజేపీకి మజ్లిస్ ఎందుకు మేలు చేయాలనుకుంటోంది… ఆ పార్టీని ఓడించాలని ఎందుకు అనుకోదు.. అంటే… బలమైన ప్రత్యర్థి ఉన్నప్పుడే.. .. అంటే బూచిగా చూపించే పార్టీ ఉన్నప్పుడే తమ పార్టీకి లాభం. అందుకే బీజేపీకి మజ్లిస్ మేలు చేస్తోంది. ఈ సారి కూడా అదే వ్యూహం అమలు చేస్తోంది. కానీ తెలంగాణ ముస్లింలు ఆలోచిస్తున్నారని అంటున్నారు. మారితే మజ్లిస్ కు గండం ప్రారంభమైనట్లే.