తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీకి వెనుకాడుతున్నారు. తన పోటీ విషయంపై ఆయన సానుకూలత వ్యక్తం చేయకపోవడంతో పార్టీ హైకమాండ్ ఆయన పేరును మొదటి జాబితాలో ప్రకటించలేదు. పోటీ చేయడం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో పార్టీ నేతల సెంటిమెంట్ దెబ్బతింటోంది. మిగతా ముగ్గురు ఎంపీలనూ అసెంబ్లీ బరిలో నిలిపారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్.. కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్… బోథ్ నుంచి సోయం బాపూరావుకు టిక్కెట్లు ప్రకటించారు. కిషన్ రెడ్డికి అంబర్ పేటలో స్థానిక పరిస్థితులు అనుకూలంగా లేవని .. అందుకే ఆయన పోటీకి వెనుకాడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
మజ్లిస్ పోటీ చేస్తే ముస్లిం ఓట్లు చీలిపోయి ఆయన బయటపడతారు. లేకపోతే.. త్రిముఖ పోటీలో పరాజయం పాలవుతారు. గత ఎన్నికల్లో అదే జరిగింది. అందుకే ఈ సారి అంబర్ పేట నుంచి వేరే వారికి అవకాశం కల్పించాలనుకుంటున్నరని అంటున్నారు. కిషన్ రెడ్డి పోటీ చేయకపోడం వల్ల ఇతర సీనియర్ నేతల్లో సెంటిమెంట్ దెబ్బతింటోంది. తామే ఎందుకు పోటీ చేయాలని కొంత మంది ఫీలవుతున్నాయి. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందున లక్ష్మణ్ కూడా పోటీ చేయడం లేదు.
మరి కొంత మంది సీనియర్లు పార్టీ పదవుల్లో తమకు తర్వాత ఎఫెక్ట్ పడుతుందని అనుకుంటే.. పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ వంటి చోట్ల.. కేంద్ర మంత్రుల్ని..సీనియర్లను బీజేపీ హైకమాండ్ బరిలోకి దింపుతోంది. కానీ తెలంగాణలో మాత్రం.. ఆయా సీనియర్ల డిమాండ్లకు తలొగ్గుతోంది.