73 ఏళ్ల చంద్రబాబును చంపుతామని .. బెదిరించడానికి వైసీపీ నేతలు వెనుకాడటం లేదు. జగన్ రెడ్డి మళ్లీ గెలవడనికి చంద్రబాబు మరణం ఖాయమని హిందూపురం ఎంపీ స్పష్టం చేశారు. సామాజిక యాత్ర పేరుతో బస్సు యాత్రను అనంతపురం జిల్లాలో ప్రారంభించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతరుల్నీ బూతులు తిట్టారు. అయితే చంద్రబాబును చంపుతామని చెప్పడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబుపై ఇప్పటికే లెక్కలేనన్ని హత్యాయత్నాలు జరిగాయి. ఎన్ఎస్జీ సెక్యూరిటీ లేకపోతే క్షణంలో ఫినిష్ అని స్వయంగా తమ్మినేని సీతారాం లాంటి వారు హెచ్చరించారు. కుప్పం నేతలు.. బోరుగడ్డ అనిల్ కుమార్ అనే ఆకురౌడీలతోనూ తరచూ చంద్రబాబును లేపేస్తామని హెచ్చరికలు చేయిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా పోలీసుల సాయంతో వైసీపీ నేతలు రాళ్ల దాడులు చేస్తూనే ఉన్నారు. తప్పుడు కేసుల్లో జైల్లో పెట్టి.. ఆయన ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ హత్యాప్రయత్నాల్లో భాగమేనని అంటున్నారు.
ఇప్పుడు జగన్ రెడ్డి మరోసారి గెలిస్తే చంద్రబాబును చంపేస్తామని హిందూపురం ఎంపీ హెచ్చరిస్తున్నారు. బహుశా.., వారి అంతర్గత్ సమావేశాల్లో ఈ మేరకు చర్చించారేమో కానీ.. మనుషుల్ని భౌతికంగా అంతమొందించే రాజకీయాలు వైసీపీ నేతలకే సాధ్యమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎదుర్కొలేక హత్యలు చేస్తామని అంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు ప్రాణానికి పెనుముప్పు ఉందని వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలతోనే స్పష్టత వస్తోందని టీడీపీ వర్గాలంటున్నాయి.