వైసీపీ క్యాడర్ లో నిరాశ భయం.. రాను రాను పెరిగిపోతున్నాయి. మాచర్లలో ఓ వైసీపీ కార్యకర్త నడిరోడ్డుబై బైక్ తగలబెట్టి పార్టీ తన విషయంలో చేసిన వ్యవహారాలు.. తనతో చేయించిన తప్పులు చెప్పుకుని ఏడ్చారు. చొక్కా విప్పుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన చూసిన తర్వాత … ఆ కార్యకర్త మాటలు విన్న తర్వాత ఎవరికైనా అర్థమయ్యేది ఒకటే.. అధికారం ఉంది కాదా అని.. అడ్డగోలుగా ప్రజల్ని వేధించి… ఇప్పుడు అధికారం పోయిన తర్వాత తమను తాము ఎలా కాపాడుకోవాలన్న భయం… పార్టీని నమ్ముకుని ఆర్థికంగా మునిగిపోయామన్న ఆక్రోశం మాచర్ల వైసీపీ కార్యకర్తలో కనిపించింది. నిజానికి ఇది ఒక్క కార్యకర్త వేదన కాదు… రాష్ట్రం మొత్తం వైసీపీ నేతలు, కార్యకర్తల వేదన.
ప్రభుత్వం మారిదే మా పరిస్థితి ఏమిటి? . ఈ ఆలోచన కింది స్థాయి నుంచి మంత్రుల వరకూ వచ్చింది. టీడీపీ వస్తే బతకనివ్వరని.. పార్టీ క్యాడర్ వద్ద బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పై స్థాయి నేతలే అలా ఉంటే కింది స్థాయి నేతల గురించి చెప్పాల్సిన పని లేదు. పై స్థాయి నేతలు… ప్రభుత్వం మారగానే ఆజ్ఞాతంలోకి వెళ్లిపోవడమో.. సంపాదించిన సొమ్ముతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకోవడమో చేస్తారని.. కానీ ఈ నేతల మాటలు విని … అరాచకాలు చేసిన కింది స్థాయి నేతలు, ద్వితీయశ్రేణి నేతల పరిస్థితేమిటన్నది ఎక్కువ మందిలో ఆందోళన కలిగిస్తున్న అంశం. మాచర్ల వైసీపీ కార్యకర్తలో మాటల్లో ప్రధానంగా ఇదే కనిపించింది.
వైసీపీ కార్యకర్తలు టీడీపీకి టార్గెట్ అవడమే కాకుండా… ఆర్థికంగానూ చితికిపోయారు. పార్టీ అధికారంలోకి రాక ముందు పార్టీ కోసం ఖర్చుపెట్టుకున్నారు..అధికారంలోకి వచ్చాక.. పనులు చేశారు కానీ బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో మరో విధంగా నష్టపోయారు. ఇక గ్రామ స్థాయిలో సర్పంచ్లు… మున్సిపల్ స్థాయిలో కౌన్సిలర్లూ సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పేరుకు పదవులే కానీ చిన్న్ అభివృద్ధి పని కానీ.. ఇతర పనులు కానీ చేసుకోలేని దుర్భర స్థితి. వీరంతా… ఇప్పుడు బ ద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతాల్లా ఉన్నారు.
మాచర్ల వైసీపీ కార్యకర్త బయటపడ్డారు. ముందు ముందు అన్ని చోట్ల నుంచి వైసీపీ హైకమాండ్ పై క్యాడర్ తిరుగుబాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే జగన్ రెడ్డి చేసిన వినాశనంలో ఎక్కువగా నష్టపోయింది సొంత పార్టీ వాళ్లే.