దసరా సందర్భంగా చంద్రబాబు జైలు నుంచి విడుదల చేశారని ప్రచారంలోకి వచ్చిన ఓ లేఖపై పోలీసులు తెగ పిసికేసుకుంటున్నారు. జైలులోపు ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఎలా వచ్చాయో పట్టించుకోలేదు. జైలుపై డ్రోన్ ఎగిరింది. ఎగిరిగింది నిజమే కానీ.. ఎవరు ఎగరేశారో తెలియదని… తెలియడం లేదని… పోలీసులు చేతకాని తనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నారు. కానీ చంద్రబాబు దసరా రోజున లేఖ రాశారని బయటకు రాగానే పోలీసు వ్యవస్థ… చివరికి డీజీపీ కూడా స్పందిస్తున్నారు.
చంద్రబాబు లేఖ ఎలా వచ్చిందనేది విచారణ చేస్తున్నామని … స్వయంగా డీజీపీ కూడా చెబుతున్నారు. ఆ లేఖ సోషల్ మీడియాలో కనిపించిన రోజునే.. జైళ్ల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన జైలు నుంచి రాలేదని తెలిపింది. లేఖ విడుదల చేయలంటే తమ అనుమతి ఉండాలని తెలిపింది. పోలీసులు, జైళ్ల శాఖ తీరుపై అప్పుడే విస్మయం వ్యక్తమయింది. రాజకీయ నేతలు లేఖలు ఎలా విడుదల చేస్తారో తెలియదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సైకిల్ తొక్కినా… లేఖ రాసినా నేరమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులతో ములాఖత్ అయినప్పుడు …. లేఖ విడుదల చేయాలని కోరారు.ఆ మేరకు చంద్రబాబు చెప్పిన అంశాలతో లేఖ విడుదల చేశారు. అంత మాత్రానికే జైళ్ల శాఖ పిసికేసకుంటోంది. అసలు విషయాలపై దృష్టిపెట్టకుండా రాజకీయాల కోసం.. వైసీపీ కోసం పని చేయడానికి ఖాకీ బాసులంతా ప్రయత్నిస్తూ… వ్యవస్థను నవ్వుల పాలు చేస్తున్నారు.