మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట , యూవీ క్రియేషన్స్ సినిమా దసరా సందర్భంగా ప్రారంభమైయింది. గతంలో సినిమాని పాటల రికార్డింగ్ తో మొదలుపెట్టేవారు. ఇప్పుడు మళ్ళీ పాత సంప్రదాయాన్ని పాటిస్తూ మ్యూజిక్ రికార్డింగ్ తో సినిమాని మొదలుపెట్టారు. ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
”మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఈ సినిమాలో 6 పాటలు ఉంటాయి. సంగీత రికార్డింగ్‌తో పూజా కార్యక్రమాలను ప్రారంభించడం సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని తిరిగి తీసుకువస్తూ, మ్యూజిక్ రికార్డింగ్‌తో మొదలుపెట్టాం. ఓ వేడుక పాటని రికార్డ్ చేశాం” అని చెప్పారు కీరవాణి.
ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఫాంటసీ అడ్వెంచర్ జోనర్ ఈ సినిమా వుంటుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరంజీవి మళ్ళీ ఈ జోనర్ లో సినిమా చేయడం ఆసక్తికరం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారు.