జగన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిందని చెబుతున్న కోడి కత్తి కేసుకు నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. బాధితుడే విచారణ జరగకుండా అడ్డుకుంటున్న విషయం కళ్ల ముందు ఉంది. కోర్టుల్లో విచారణలు జరగకుండా ఎప్పటికప్పడు పిటిషన్ల మీద పిటిషన్ల వేస్తూ.. వస్తున్నారు. ప్రస్తుతం కింది కోర్టులో విచారణ జరగకుండా హైకోర్టు ఎనిమిది వారాల స్టే ఇచ్చింది.
కోర్టుకు హాజరయ్యేందుకు పాదయాత్రలో ఉన్న జగన్ రెడ్డి విశాఖ ఎయిర్ పోర్టు నుుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమమయ్యారు. ఆ సమయంలో వీఐపీ లాంజ్ లో ఉన్నప్పుడు.. టీ ఇవ్వడానికి వచ్చిన జనపల్లి శ్రీను అనే యువకుడు.. కోడికత్తితో జగన్ రెడ్డిపై దాడి చేశారు. దాంతో అతన్ని పోలీసులకు అప్పగించారు. గాయం చిన్నదే కావడంతో ఎయిర్ పోర్టులో ఉన్న నర్సింగ్ స్టాఫ్ తో శుభ్రం చేయించుకుని జగన్ రెడ్డి వెళ్లిపోయారు.
కానీ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత.. విచిత్రంగా .. స్ట్రెచర్ మీద ఆస్పత్రికి వెళ్లారు. కనీసం రెండు వారాలు ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నారు. మరో రెండు వారాలు ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. కోడి కత్తి గాయం చాలా లోతుగా అయిందని వైద్యులు చెప్పారు. తొమ్మిది కుట్లేశామని కథలు చెప్పారు. ఈ కేసు కేంద్రంగా జరిగిన రాజకీయం అంతా ఇంతా కాదు. చికిత్స చేయించుకున్న వ్యక్తి సీఎం అయ్యారు. తర్వాత చికిత్స చేసిన వైద్యుడికి ఏపీలో ఓ పదవి దక్కింది. ఈ డ్రామాలో భాగమైన వారందరికీ ఏదో ఓ పదవి దక్కింది.
కానీ నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు మాత్రమే బలిపశువు అయ్యాడు. ఐదేళ్ల నుంచి జైల్లో నే ఉన్నాడు. ముసలి తల్లిదండ్రులు ఏడుస్తూనే ఉన్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం బెయిల్ రావడానికి కూడా సహకరించడం లేదు… సరి కదా విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారు. కోర్టులో ట్రయల్ కు వచ్చే సరికి ఎన్ఐఏతో మరింత లోతుగా విచారణ చేయాలని పిటిషన్ వేశారు.