ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు బయటపడటం అధికార బీఆర్ఎస్ పార్టీకి సమస్యగా మారింది. దశాబ్దాల కిందట కట్టిన బ్యారేజులు, ప్రాజెక్టులు ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ పట్టుమని ఐదేళ్లు కాకుండానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. దీన్ని ఎలా సమర్థించుకోవాలో అధికార పార్టీకి అర్థం కావడం లేదు. అందుకే కొత్తగా కుట్ర కోణంతో ప్రచారం ప్రారంభించారు.
మేడిగడ్డ కుంగిపోవడం వెనుక కుట్ర ఉందని … ఇంజనీర్ ఫిర్యాదు చేస్తే అధికారులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పోలీసు శాఖ ప్రకటించింది. ఇందులో మావోయిస్టుల ప్రమేయం లేదని మందుగానే చెప్పి.. పోలీసులు కొంత వరకూ భారం దించుకున్నారు. అంటే.. రాజకీయ కుట్రేనని ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేశారన్నమాట. నిజంగా ఎందుకు కుంగిదో తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. నిపుణులు రెండు, మూడు రోజుల పాటు పరిశీలిన చేశారు.
విద్రోహ చర్య వల్ల కుంగితే… వెంటనే ఆనవాళ్లు దొరికిపోతాయి. కానీ అలాంిదేమీ కనిపించకపోవడంతో .. పెద్ద శబ్దం వచ్చిందన్న కారణం చెప్పి కేసు నమోదు చేశారు. అసలు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంోనే అతి పెద్ద లోపం ఉందని.. అక్కడ డిజైన్ తేడా ఉందన్న విమర్శలను నిపుణులు కొంత కాలంగా చేస్తున్నారు. నిర్మాణ లోపాలూ ఉన్నాయంటున్నారు. అతి వేగంగా నిర్మించి.. క్వాలిటీని పట్టించుకోలేదన్న ఆరోపణలూ ఉన్నాయి.
మొత్తంగా ఎన్నికలకు ముందు ఇలా జరగడంతో.. వీలైనంత వరకూ చర్చల్లోకి రాకుడా చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో కుట్ర చేశారని.. రాజకీయం కూడా ప్రారంభించింది. ఎన్నికలు అయ్యే వరకూ ఈ రాజకీయం ఇలా నడిచే అవకాశం ఉంది.