బతుకులు మార్చిన వారిని మర్చిపోని మనుషులు ఉండటం వల్లనే సమాజంలో ఇంకా విలువలు ఉన్నాయి. ఈ విషయాన్ని మరోసారి గచ్చిబౌలి స్టేడియం నిరూపించింది. చంద్రబాబునాయుడు ఐటీ అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా.. ఆయనను అక్రమ కేసుల్లో జైల్లో పెట్టిన సందర్భంలో సంఘిభావంగా.. ఐటీ ప్రొఫెషనల్స్ ఫోరం ఏర్పాటు చేసిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ ప్రొగ్రామ్‌కు స్వచ్చందంగా జనాలు తరలి వచ్చారు. స్టేడియం మొత్తం క్కికిరిసిపోయింది. చంద్రబాబుకు మద్దతుగా ప్రతి ఒక్కరు తమ సంఘిభావాన్ని తెలిపారు.
అది రాజకీయ సభ కాదు. అంతకు మించి తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదని ప్రకటించారు. అక్కడికి వచ్చిన వారందరూ చంద్రబాబుకు సంఘిభావం తెలియచేయాలన్న ఉద్దేశంతోనే వచ్చారు. ఐటీ రంగం ద్వారా ఉపాధి పొందిన వారందరూ… తమ మెంటార్‌కు అండగా నిలబడేందుకు ఉత్సహం చూపించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడికి సంఘిభావంగా ఇలాంటిప్రదర్శనలు జరిగి ఉండవు. ఆ ఘనత…. ఆ గొప్పతనం… చంద్రబాబుకే సొంతం.
చంద్రబాబు మాస్ లీడర్. రియల్ మాస్ లీడర్. ప్రపంచ గతిని… ఆర్థిక వ్యవస్థును ముందుకు తీసుకెళ్లే ప్రభావవంతమైన వ్యక్తుల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్. పేద కుటుంబాల్ని ఐటీ రంగం ద్వారా ఉన్నత స్థానికితీసుకెళ్లిన మాస్ లీడర్. అందుకే ఆయనకు అన్ని వర్గాల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఒక్క రూపాయి అవినీతి చూపించకుండా. వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆయనను జైలులో పెట్టవచ్చు కానీ… ప్రజల గుండెల్లో ఉండే అభిమానాన్ని మార్చం చెరపలేరని మరోసారి నిరూపితమైంది.
చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఇప్పటి వరకూ ప్రదర్శించే అవకాశం లేని వారందరికీ… ఆయనను జైల్లో పెట్టడం ద్వారా…. తమ అభిమానాన్ని.. సంఘిభావాన్ని చూపించే అవకాశాన్ని కల్పించారని అనుకోవచ్చు.