రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు వస్తే.. లేకపోతే ఘోరం జరిగితే సహాయ కార్యక్రమాలను పర్యవేక్షంచాడనికి సీఎం వెళ్లడం మహా పాపమని గతంలో జగన్ రెడ్డితో పాటు ఆయన సలహాదారుడు సజ్జల సెలవిచ్చారు. అలా వెళ్తే అధికారంలతా సీఎం వెంట తిరగడం వల్ల పనులు కావన్నారు. బాధితులకు నష్టం జరుగుతుందన్నారు. అందుకే సొంత జిల్లాలో డ్యాం కొట్టుకుపోతే ఆయన పోలేదు. పది రోజుల తర్వాత.. పోయి ఇళ్ల సంగతి నాకొదిలేయండి అని సంప్రదాయమైన భాషలో హామీ ఇచ్చి వచ్చారు.
అలాగే వదిలేశారు.. వాళ్లాంతా ఇప్పటికీ టార్పాలిన్ కిందే తలదాచుకుంటున్నారు. వరదలు వచ్చినా.. రైతులు నష్టపోయినా ఎన్నడూ పరిశీలించిన పాపాన పోలేదు. కానీ ఇప్పుడు విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరగిందనగానే.. ప్రత్యేక విమానం, హెలికాఫ్టర్లతో వెళ్లిపోయారు. అదృష్టవశాత్తూ.. రైల్వే అధికారులు.. సంఘటనా స్థలంలో బాధితులెవరూ లేరని.. రావాల్సిన అవసరం లేదని ముఖం మీదనే చెప్పేశారు. దీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి కాస్త మీడియా హైప్ చేద్దామనుకున్న ఆయనకుషాక్ తగిలిగినట్లయింది. అయితే చేతిలో హెలికాఫ్టర్ ఉంది కాబట్టి.. పైనుంచి రెండు, మూడు ట్రిప్పులేసి చూశారు. తర్వాత ఆస్పత్రులకు వెళ్లి రోగుల్ని పరామర్శించారు. ఇంత అర్జంట్‌గా బాధితులపై జగన్ రెడ్డికి అంత ఆపేక్ష ఎందుకు వచ్చిందంటే.. ఎన్నికలు వచ్చేశాయి.
ఇప్పుడు మళ్లీ నేనున్నానని వెళ్లాలి. నాలుగున్నరేళ్ల వరకూ ఎందుకు లేవు అని ఎవరూ అడగకుండా.. ముందుగానే జాగ్రత్త పడతారు. ఇక్కడ అసలు ట్విస్టేమిటంటే.. మంత్రులు సహాయ కార్యక్రమాల్లో ఉన్నారట.. అందుకే కేబినెట్ భేటీని వాయిదా వేశారట. అసలు రెస్క్యూ ఆపరేషన్ మొత్తం రైల్వేలు చేసుకుంటున్నాయి. ట్రాక్‌లు పునరుద్ధరించుకున్నాయి. ఇక జగన్ రెడ్డి మంత్రులు ఎం చేస్తున్నారో మరి.. ఇంత మాత్రం దానికే కేబినెట్ బేటీ వాయిదా అని ప్రచారం.