నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎక్స్ట్రా’. ఆర్డినరీ మ్యాన్… అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. తాజాగా టీజర్ ని వదిలారు. ”కథ అంటే మామూలు కథ కాదు. రియల్ ఇన్సిడెంట్స్ ని చూసి రాసుకున్న కథ”అనే వాయిస్ తో టీజర్ మొదలలైయింది. టీజర్ చూసిన చూశాక ఇది ‘కిక్’ తరహ క్యారెక్టర్ బేస్డ్ కథని అర్ధమౌతుంది. ఈ కథలో హీరో ఒక జూనియర్ ఆర్టిస్ట్. అతని పాత్రకు భారీ బిల్డప్పులు ఇచ్చి చివరికి బాహుబలి జూనియర్ ఆర్టిస్ట్ గా నవ్వించారు.
జూనియర్ ఆర్టిస్ట్ అనగానే బాహుబలి సినిమాలో యుద్ధ సన్నివేశాలలో నటించారనే చాలా జోక్స్ వుంటాయి. ఇందులో ఐతే ఏకంగా బాహుబలి సీన్ వాడేశారు. సిజీ చేసి నితిన్ ని బాహుబలి దర్భారు ఐదు వరుసలో నిలబెట్టారు. ఆ సీన్ బావొచ్చింది. టీజర్ లో ఫన్ కి పెద్ద పీట వేశారు. శ్రీలీల, నితిన్ కెమిస్ట్రీ కమర్షియల్ పంధాలో వుంది. రావురమేష్ పాత్ర టీజర్ లో మరో ఆకర్షణగా నిలిచింది. చివర్లో నితిన్ .. ఎక్స్ట్రా.. ఆర్డినరీ అనకుండా కలిపి చూడు అనడం.. దానికి కౌంటర్ గా రావురమేష్.. చెత్త.. నాకొడుకు అని చెప్పడం హిలేరియస్ గా వుంది. టీజర్ లో కథ గురించి లేదు. కేవలం క్యారెక్టర్ మాత్రమే వుంది. ఇప్పటివరకూ వక్కంతం వంశీ రాసిన పాత్రల్లో ‘కిక్’ బావుంటుంది. ‘ఎక్స్ట్రా’ క్యారెక్టర్ తో మళ్ళీ అలాంటి క్యారెక్టర్ మ్యాజిక్ ని క్రియేట్ చేయాలని ప్రయత్నం కనిపించింది. డిసెంబర్ 8న సినిమా విడుదలౌతుంది.