చంద్రబాబుకు ఏపీ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కనీస ఆధారాలు కేసులో ఇప్పటికే ఆయన 53 రోజులుగా జైల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన అనారోగ్య సమస్యల కారణంగా మధ్యంతర బెయిల్ అడిగితే…. ప్రభుత్వ తరపు న్యాయవాది వద్దని వాదించారు. ఆయనకు అందరికీ ఉండే సమస్యలే ఉన్నాయని అత్యంత అమానవీయంగా వాదించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు చేపట్టాల్సి ఉంది.
ఇప్పటికే సుప్రీంకోర్టులో తనపై పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులని.. 17ఏ సెక్షన్ ప్రకారం రిమాండ్ రిపోర్టును కొట్టి వేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ పూర్తయింది. ఎనిమిదో తేదీ లోపు తీర్పు రావాల్సి ఉంది. చంద్రబాబు ఒక కంటికి నాలుగు నెలల క్రితం క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. మూడు నెలల్లో మరో కంటికి చేయించుకోవాల్సి ఉంది. కానీ చేయించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ తరపు లాయర్ వాదించారు.
మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు మంగళవారమే విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తంగా తన రాజకీయ జీవితంలో ప్రజలకు రోజుల తరబడి కనిపించని సందర్భాలు లేవు. ఆయనను ప్రభుత్వం జైలులో పెట్టి మానసికంగా.. శారీరకంగా దాదాపు రెండు నెలలు హింస పెట్టిన తర్వాత తొలి సారిగా బయటకు రాబోతున్నారు.