ఫిబ్రవరి వరకూ చంద్రబాబు జైల్లో ఉంటారని తన పత్రికలో రాయించి.. అదే జరుగుతుందని జగన్ రెడ్డిని కూడా నమ్మించారేమో కానీ ఇప్పుడు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చే సరికి.. సజ్జల రెడ్డి కంగారులో ఆగలేకపోతున్నారు. ఏం మట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా.. మీడియాను పిలిచి మాట్లాడేశారు. చంద్రబాబు వీర యోధుడా.. లయన్ ఈజ్ బ్యాక్ అని ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని.. నిజం గెలిచిందా అని ప్రశ్నించారు. కేవలం మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇచ్చారని నాలుగువారాల తర్వాత మళ్ల జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు జైలుకు మళ్లీ వెళ్తారా లేదా అన్న సంగతేమో కానీ.. చంద్రబాబు బయటకు వస్తున్నారంటే వైసీపీలో కంగారు కనిపిస్తోంది. చంద్రబాబు ర్యాలీలు చేయకుండా నోరు తెరవకుండా ఉండాలని.. మీడియాతో మాట్లాడకుండా చేయాలని తెగ తాపత్రయ పడిపోతున్నారు. అన్ని రకాల కుట్రలు ఇందు కోసం చేస్తూనే ..మళ్లీ సజ్జల చంద్రబాబు బయట ఉంటేనే పొలిటికల్ ఫైట్ ఉంటందని.. ఆయన లోపల ఉన్నా.. బయట ఉన్నా పెద్ద తేడా ఉండని అంటున్నారు. సజ్జల వ్యవహారం వైసీపీలోనూ ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. కుట్రలు చేసి తప్పుడు కేసులు పెట్టింది కాక.. స్కిల్ కేసులో చంద్రబాబు నిర్దోషి అయితే ఆధారాలు బయట పెట్టాలని సవాల్ చెప్పారు.
గుడ్డ కాల్చి మీద వేసి తుడుచుకో అన్నట్లుగా మాట్లాడారు సజ్జల.. కేసు పెట్టి.. రెండున్నరేళ్లు అవుతున్నా ఏ ఒక్కరిపై చిన్న ఆధారం చూపించలేకపోయారు. అయినా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్టు చేసి.. ఇప్పుడు నిరూపించుకో అని చంద్రబాబు ను సవాల్ చేస్తున్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ.. ఇష్టారీతిన కుట్రలు చేస్తున్న సజ్జలకు రోజులు ఎప్పుడూ ఒకలాగే ఉండని ముందు ముందు తెలుస్తుందని.. టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.