టీడీపీ అధినేత చంద్రబాబు తన జీవిత కాలంలో ఎప్పడూ కనీసం పది రోజులు అయినా ప్రజల్లోకి వెళ్లకుండా ఉండలేదు. పాతికేళ్లకే ఆయన రాజకీయ ఆరంగేట్రం చేశారు. రాజకీయాల్లో తిరగడం ప్రారంభించారు. అప్పట్నుంచి ఇప్పటి వరకూ ఆయన దినచర్య ప్రజలతోనే.. ప్రజల కోసమే ఉంటుంది. అలాంటిది.. ఆయనను ప్రజలకు దూరం చేయాలని.. మానసికంగా.. శారీరకంగా హింసించాలని తప్పుడు కేసులు పెట్టిన ప్రభుత్వం.. జైలుకు పంపి 52 రోజుల పాటు లోప ఉంచగలిగింది.52 రోజుల తర్వాత ఆయన బెయిల్ వచ్చిందని తెలిసిన తర్వాత రాష్ట్రం మొత్తం ఓ భావోద్వేగానికి గురయింది.
చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చే సమయానికి వేల మంది గుమికూడారు. కోట్ల మంది టీవీల్లో చూశారు. ఆయన ఎలా ఉన్నారని.. చర్చించుకున్నారు. చంద్రబాబు మానసికంగా ధృడంగా ఉన్నప్పటికీ.. శారీరకంగా అలసిపోయినట్లుగా కనిపించారు. చాలా రోజుల పాటు ఆయనకు కనీస సౌకర్యాలు ఇవ్వలేదు. ఆయనకు ఉన్న ఆరోగ్య పరమైన సమస్యల వల్ల కోర్టు చెబితే ఏసీ పెట్టించారు. అయినా సమస్యలు మాత్రం కొనసాగాయి. తన భద్రతపై చంద్రబాబాబు నాయుడు జైల్లో కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయింది. మొత్తంగా చంద్రబాబు విడదల వేళ రాష్ట్రం మొత్తం అందరి చూపు రాజమండ్రి జైలు వైపు పడింది. వైసీపీ నాయకులు కూడా చంద్రబాబు విడుదల కేసమో చూశారు. చంద్రబాబు జైల్లో ఉన్నంత కాలం.. అత్యదిక మంది వైసీపీ నేతలు టెన్షన్ కు గురయ్యారు.
నిరసనలు ఏ మాత్రం తగ్గపోగా.. సెంటిమెంట్ అంతకంతకూ పెరుుగుతూ పోయింది. కొంత మంది మాత్రం.. సజ్జల చెప్పినట్లుగా నోరు పారేసుకుని ప్రజల్లో బ్యాడ్ అయ్యారు. ఎలా ఉన్నా.. చంద్రబాబును యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టి.. .. తమ అహం తీర్చుకున్నారు కానీ.. చంద్రబాబుకే మేలు చేశారని. .. జన స్పందనతో స్పష్టయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.