చంద్రబాబు అరెస్ట్ వెనుక భారీ అధికార కుట్ర జరిగిందని.. తర్వాత విచారణలో అరెస్టు చేయడానికి వచ్చిన సీఐడీ అధికారుల కాల్ డేటా ఎంతో కీలకమని.. ఆ రికార్డులను భద్రపర్చాలని చంద్రబాబు తరపు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అంటే.. కాల్ డేటాను తమకు ఇవ్వాలని చంద్రబాబు తరపు లాయర్లు అడగలేదు. కేవలం కోర్టులో సమర్పించాలని భద్రపరచాలని మాత్రమే అడిగారు. అయితే ఇలా చేయడం సీఐడీ అధికారుల భద్రతకు..ప్రైవసీకి భంగకరమని.. వారు విధి నిర్వహణకు ఇబ్బంది అవుతుందని కోర్టులో వాదించారు. సీఐడీ వాదనను ఏసీబీ కోర్టు అంగీకరించింది.
తమకు అన్యాయం జరిగిందని.. తమ పై ఘోరమైన కుట్ర జరిగిందని బాధితులు వేడుకున్నా ప్రయోజనం లేకపోయింది. చంద్రబాబు అరెస్టు ఓ భారీ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తోంది. ఎఫ్ఐఆర్ లో కూడా పేరు లేదు. అరెస్టు చేసిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అరెస్టు చేసిన 24 గంటల తర్వాత కోర్టు్లో ప్రవేశ పెట్టారు. ఈ మధ్యలో లంచ్ మోషన్ పిటిషన్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి దగ్గర చంద్రబాబు తరపు లాయర్లు దాఖలు చేసినా పరిగణనలోకి తీసుకోలేదు. ఇలా చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి. తీర్పు వచ్చిన తర్వాత సర్టిఫైడ్ కాపీలను అడిగారని చంద్రబాబు తరపు లాయర్ ను సీపీ బెదిరించారు.
ఇలా అంతర్గతంగా చాలా కుట్రలు జరిగాయి. వీటన్నింటిపై తదుపరి దర్యాప్తు కోసమైనా కాల్ డేటా కీలకమని భావించినా ఉపయోగం లేకపోయింది. ఏసీబీ కోర్టు తీర్పుపై టీడీపీ లాయర్లు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఆలస్యం అయితే.. ఆ కాల్ డేటా రికార్డులను తొలగించాలని ప్రభుత్వం టెలికాం కంపెనీలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.