చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు బండి సంజయ్ దగ్గర్నుంచి కట్టా శేఖర్ రెడ్డి వరకూ అందరూ జగన్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకున్నారని సింపుల్గా తేల్చేశారు. కానీ కుట్ర సలహాల సిద్దాంతకర్తలు .. చంద్రబాబు వయసు అయిపోయిందని ఆయనను జైల్లో పెడితే పార్టీ బలహీనం అవుతుందని ఆశపడ్డారు. అదే చెప్పి అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అసలు విషయం మాత్రం చంద్రబాబుకు బెయిల్ రాగానే క్లారిటీ వచ్చింది.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన మరుక్షణం.. అది మెడికల్ గ్రౌండ్స్ మీద వచ్చిన బెయిలా…. మధ్యంతర బెయిలా మరొకటా అన్నది ప్రజలు పట్టించుకోలేదు. ఆయన బయటకు వచ్చారు అన్న ఉత్సాహమే అంతటా కనిపించింది. ఈ స్థాయిలో ప్రజా స్పందన వస్తుందని ఊహించని సజ్జల రెడ్డి వెంటనే ఏడుపులు ప్రారంభించారు. ర్యాలీలు చేస్తారా అంటూ… తనకు ఉన్న అధికార బలంతో వెంటనే సీఐడీతో కట్టడి చేయడానికి పిటిషన్ వేయించారు. ఆయన భయంతోనే చంద్రబాబు స్టామినా ఏమిటో స్పష్టమయింది.
కానీ వారు ఊహించినంత కన్నా … ఊహించనంత ఎక్కువగా చంద్రబాబుపై ప్రజల్లో ఆదరణ పెరిగిందని స్పష్టమయింది. రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకోవడానికి పధ్నాలుగు గంటలు పట్టింది. అడుగడుగునా జన నీరాజనం. అర్థరాత్రి.. తెల్లవారుజామున అనే తేడా లేదు… మొత్తం జనసందోహం. ఆ జనాన్ని చూసి తాము తవ్వుకున్న గొయ్యి లోతు… కిలోమీటర్.. రెండు కిలోమీటర్ల లోతు ఉండగా.. ఏకంగా వంద కిలోమీటర్ల లోతు ఉంటుందని వైసీపీ క్యాడర్ కూ ఆర్థమైపోయింది.
ఓ వైపు స్వయంగా జగన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే వచ్చే జనం లేరు. సాధికారయాత్రల పేరుతో బస్సుల్లో తిరుగుతూంటే.. సిటీ బస్సులన్నా ఫుల్ అవుతాయి కానీ.. బస్సు యాత్రలో పట్టుమని వంద మంది కనిపించడం లేదు. ఓ వైపు టీడీపీ పిలుపునివ్వకపోయినా రోడ్ల మీదకు వస్తున్నారు. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందే… వైసీపీకి సినిమా అర్థమైపోయింది..