జగన్ రెడ్డి చేసే నేరాలు పకడ్బందీగా.. తనకేం సంబంధం లేకుండా ఇతరుల మీద ఎలా తోసేస్తారో… దానికి అధికారులు.. ఆయన కింద ఉన్న వారు ఎలా బలవుతారో అన్నదానికి పక్కా సాక్ష్యం రుషికొండ అక్రమ నిర్మాణాలను సీఎం క్యాంప్ ఆఫీసుగా సిఫారసు చేయించుకోవడం. జగన్ రెడ్డి మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం సీఎం క్యాంప్ ఆఫీసు కోసమే ఆ ప్యాలెస్ కట్టించుకున్నారు. ఐదు వందల కోట్ల ప్రజా ధనం ఖర్చు చేశారు. అయితే ఇప్పుడు ఓ కమిటీని నియమించి… ఆ కమిటీతో ఆ ప్యాలెస్ లో సీఎం ఉండటానికి బాగుంటుందని సిఫారసు చేయించారు.
అంటే ఇప్పుడు తప్పంతా ఆ కమిటీ మీదకు పోయింది. తన తప్పేం లేదని.. అది టూరిజం కోసం కట్టిన భవనం అని… అక్కడ ఉండాలని.. కమిటీ సిపారసు చేసిందని.. ఆ మేరకు సీఎం అక్కడకు వెళ్తున్నారని వాదిస్తారు. నిజానికి అది అక్రమ కట్టడం అని హైకోర్టు తేల్చింది. చర్యలు తీసుకోవాలని కేంద్ర అటవీ, పర్యావరణశాఖకు సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు గతంలో… ఎక్కడ భవనాలు ఉన్నాయో… అక్కడ మాత్రమే నిర్మించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ అక్కడ ఉన్న భవనాలకు నాలుగైదు రెట్లు మించి కట్టడాలు చేశారు. ఇవన్నీ శిక్షార్హమైనవే.
సుప్రీంకోర్టు కన్నెర్ర చేస్తే…. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి భవనాలనైనా కూలగొట్టాల్సిందే. గతంలో ఢిల్లీలో అతి భారీ అపార్టుమెంట్లను కూలగొట్టారు. ఇప్పుడు రుషికొండ పూర్తిగా సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారు. విశాఖకు రక్షణ కవచంలా ఉండే రుషికొండను బోడిగుండు చేశారు. పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేశారు. కానీ అక్కడే క్యాంప్ ఆఫీస్ అంటూ సిఫారసు చేయించుకున్నారు.