చంద్రబాబుపై కేసులు పెట్టడానికి రాత్రి రాత్రికి గంట సమయం చాలు. కేసులు పెట్టినట్లుగా అర్థరాత్రి ఏసీబీ కోర్టుకు సమాచారం ఇస్తారు. కానీ దానిపై కౌంటర్లు కోర్టుల్లో దాఖలు చేయాల్సి వస్తే వారాలకు వారాల సమయం అడుగుతారు. మద్యం అనుమతుల్లో అక్రమాలంటూ చంద్రబాబుపై మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే.. వాదనలు వినిపించడానికి తమకు రెండు వారాల సమయం కావాలని కోరారు. కేసు పెట్టినప్పుడు … అందులో చంద్రబాబు ప్రమేయం ఉందని నిర్ధారించినప్పుడు అప్పటికప్పుడు కోర్టులో వాదనలు వినిపించడానికి వచ్చిన అడ్డంకేమిటి ?
ఒక్క ఈ కేసులోనే కాదు… రెగ్యులర్ బెయిల్ పై వాదనలు వినిపించడానికి కూడా సమయం కోరారు. తప్పుడు కేసులు పెట్టి…. మీడియా ముందు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే ఏఏజీ, సీఐడీ చీఫ్ కోర్టుకు మాత్రం ఆధారాలు ఇవ్వరు. కానీ వారాల తరబడి వాయిదాలు కోరుతూ ఉంటారు. ఇప్పటి వరకూ .. స్కిల్ కేసులో డబ్బులు చంద్రబాబుకు వచ్చాయని నిరూపించలేదు. టీడీపీకి వచ్చిన విరాళాలు అవే కావొచ్చని… ఆ వివరాలు కావాలంటూ బ్యాంకుల్ని అడుగుతున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లేవని ఇలాంటి చర్యల ద్వారా సీఐడీ అధికారులే నిరూపిస్తున్నారు.
న్యాయవ్యవస్థలో ని లోపాలను అడ్డం పెట్టుకుని వ్యవస్థలతో ఓ ఆటాడుకుంటూ… రాజకీయ ప్రత్యర్థుల్ని వేధిస్తున్నారు. వ్యవస్థల్లో బలహీనమైన వ్యక్తులు… అవినీతి పరులు ఉన్నప్పుడు కొంత మేర వారనుకున్నట్లుగా నడిపించగలరు కానీ ఎల్లవేళలా కాదు. ఆ విషయంపై త్వరలోనే సీఐడీ అధికారులకూ ఓ స్పష్టత వచ్చే చాన్స్ ఉంది.