ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అది ఓ రకంగా జనం మూడ్‌ని తెలిపింది. అచ్చమైన సర్వే. కానీ దాన్ని గుర్తించడానికి అహం అడ్డు వచ్చిన సజ్జల రెడ్డి మా ఓటర్లు వేరే అని పార్టీ నాయకులను మోసం చేశారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కూడా ఓట్లేయలేదన్న నిజాన్ని దాచి పెట్టేశారు. కానీ చంద్రబాబు అరెస్టు…. బెయిల్ పై విడుదల తర్వాత చూస్తున్న జన స్పందన చూస్తే.. వైసీపీ వాళ్లకు అర్థం కావాల్సి ఉంది.
చంద్రబాబు కోసం తరలింపుల్లేవ్.. స్వచ్చంద జనాలు !
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత ఉండవల్లి నివాసానికి చేరుకోవడానికి పధ్నాలుగు గంటలు పట్టింది. చంద్రబాబు ఎక్కడా ఉపన్యాసాలు ఇవ్వలేదు. వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, హనుమాన్ జంక్షన్, బెంజి సెంటర్ వద్ద గుమిగూడి వేచివున్న వేలాది మంది అభిమానులకు చేతులు ఊపుతూ, నమస్కారాలు పెడుతూ ఒక్కమాట కూడా మాట్లాడకుండా సాగిపోవడానికే చంద్రబాబుకి 14 గంటలు పట్టింది. మనుషులు ఊర్లు వేరువేరు కాని దారిపొడవునా…జై చంద్రబాబు, డౌన్ డౌన్ జగన్ నినాదాలు… పూలు విసిరేయడం, దిష్టి తీసేయడం…ఇవే దృశ్యాలు. ప్రతీ చోటా స్త్రీల సంఖ్య విశేషంగావుంది. అందరూ విద్యావంతులైన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఆదాయవర్గాలవారే. స్వచ్చందంగా తరలి వచ్చిన వారే.
మధ్యతరగతి ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి సాక్ష్యం
సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర, 73 ఏళ్ళ వయసు, కక్షతోనే ఆయన్ని జైల్ లో వేశారన్న నమ్మకం ప్రజల్లో ఉంది. అయితే తెల్లవార్లూ దారిపొడవునా సంఘీభావం చూపుతూనే వుండటానికి సానుభూతి మాత్రమే కారణం కాదు. జగన్ ప్రభుత్వం వల్ల ప్రజల్లో ఉన్న వ ధోరణులవల్ల ఆయన మళ్ళీ అధికారంలోకి రాకూడదని లో మధ్యతరగతి ప్రజలు కోరుకునేదశకు జగన్ పై వ్యతిరేకత పెరిగింది. సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి వంద రూపాయలు దోచుకుంటున్న వైనంపై ప్రజలు అర్థం చేసుకున్నారు. తమను పిండి పేదల పేరుతో ఓటు బ్యాంక్‌కు పెడుతున్నారని స్పష్టమవుతోంది.
వ్యతిరేకత ఉందని తెలిసినా తప్పులు చేసి సీటు కిందకు నీళ్లు తెచ్చుకున్న జగన్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం తర్వాత తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకోవాల్సిన జగన్ రెడ్డి…. మరింత సైకోతనం చూపించడం ప్రారంభించారు. కోర్టుధిక్కారాలు, కక్షసాధింపులు, ప్రత్యర్ధుల్ని శత్రువులుగా అణచివేత, నియంతృత్వం, జనాభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం మొదలైనవన్నీ మధ్యతరగతిలో ఆయనపట్ల వ్యతిరేకతను వరదలా పెంచేస్తున్నాయి. రేపు ఎన్నికల్లో ఇది సునామీలా చుట్టు ముడుతుంది. అధికార అహంకారం దిగేవరకూ వారికి అర్థం కాదు.
ఏం పీకుతామో చూశారుగా అని బొత్స… చంద్రబాబు యాభై మూడు రోజుల్ని జైల్లో పెట్టడం గురించి మాట్లాడారు. అధికారంలో ఉన్న వారు ప్రతిపక్ష నేతల్ని జైల్లో పెట్టడమే పీకడం అయితే… ప్రజల పీకుడుకు బొత్స లాంిటి వాళ్లు కొట్టుకుపోతారు. అప్పుడు ఏడ్చినా ప్రయోజనం ఉండదు.