తాము చెప్పిందే తీర్పు.. పెట్టిందే షరతు అన్నట్లుగా వ్యవహరిస్తున్న సాక్షి … హైకోర్టును సైతం బ్లాక్ మెయిల్ చేసేందుకు రంగంలోకి దిగింది. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన తర్వాత… సర్టిపైడ్ కాపీ రావడానికి ఓ కీలక ఉద్యోగి సహకరించారంటూ ఆయనపై నిందలేశారు. ఈ కాపీ ఇచ్చేది స్వయంగా రిజిస్ట్రార్ మాత్రమే. ఆయన జిల్లా జడ్జి స్థాయి అధికారి ఉంటారు. ఆయనపై సాక్షి నిందలేసింది. తాము చెప్పినట్లుగా చేయకపోతే మరకలు పూస్తామని హెచ్చరికలు పంపింది.
సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి వారం పడుతుందని గంటల్లోనే ఇచ్చేశారని సాక్షి అభియోగం. నిజానికి ఆ కాపీ తీసుకుంది ప్రభుత్వ న్యాయవాది. చంద్రబాబు బయటకు వచ్చినా జైలులోనే ఉన్నట్లుగా కదలకుండా చేయాలని.. షరతులు విధించేలా చూసుకునేందుకు వెంటనే లంచ్ మోషన్ దాఖలుచేసేందుకు సర్టిఫైడ్ కాపీకి దరఖాస్తు చేసుకున్నారు. వెంటనే తీసుకున్నారు. ఇలా ఎవరు దరఖాస్తు చేసినా రెండు వర్గాలకూ సర్టిఫైడ్ కాపీ ఇస్తారు.
నిజానికి బెయిల్ మీద బయటకు రావడనికి సర్టిఫైడ్ కాపీ అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు బెయిల్ తక్షణం అమల్లోకి వస్తుందని చెప్పిన తర్వాత ష్యూరిటీలు సమర్పిస్తే సరిపోతుంది. కానీ హైకోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా ఏదో జరుగుతోందని ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడానికి న్యాయవ్యవస్థపై నిందలు వేయడానికి.. సాక్షి బరి తెగించింది. అయితే మేనేజ్ చేయడం లేకపోతే… బ్లాక్ మెయిల్ చేయడం జగన్ రెడ్డి వ్యూహం. గతంలో ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైనే తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు హైకోర్టు మీద పడ్డారు. ఇలాంటి వారిని కంట్రోల్ చేయకపోతే….. గుడ్డ కాల్చి మీద వేసి వ్యవస్థల్ని కూడా తమతో సమానం చేసేసుకుంటారు.