ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని వైసీపీ నేతలు ఘోరంగా అవమానిస్తున్నారు. వైసీపీ అవినీతిని ప్రశ్నిస్తున్నారని ఆమెపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. మహిళ అని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బూతు లీడర్లుగా ముద్రపడిన వారిని రంగంలోకి దింపారు. ఇంతా జరుగుతున్నా… రాష్ట్ర బీజేపీ కేంద్ర బీజేపీ నేతలకు మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా లేదు.
ఇటీవల తమిళనాడులో తమ పార్టీ కార్యకర్తలపై హత్యలు, దాడులు జరుగుతున్నాయని అక్కడి పరిస్థితిని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని జేపీ నడ్డా ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ లో సభ్యురాలిగా పురందేశ్వరిని నియమించారు. తమిళనాడు కార్యక్త ల కోసం అంతగా ఆపేక్ష చూపిస్తున్న బీజేపీ నాయకత్వం ఏపీలో .. తమ పార్టీ నేతలపై జరుగుతున్న వ్యక్తిత్వ హననాలను మత్రం లైట్ తీసుకుంటోంది. ఢిల్లీలో తమతో సన్నిహితంగా ఉంటున్నట్లుగా వ్యవహరిస్తూ.. కేసులు.. ఇతర వ్యక్తిగత పనులు చక్కబెట్టుకుంటున్న వారే.. సొంత నేతల్ని కించ పరుస్తున్నా స్పందించడం లేదు. ఈ పరిస్థితి పురందేశ్వరికి కూడా ఇబ్బందికరంగానే మారింది.,
ఏపీలో పదకొండు లక్షల కోట్లకు అప్పులు చేరాయి. ఈ విషయం ఆధారాలతో సహా పురందేశ్వరి వెల్లడిస్తే.. పార్లమెంట్ లో రాష్ట్రం ఇచ్చిన లెక్కలను ఇచ్చారు నిర్మలా సీతారామన్. అంతకు ముందు ఆమెకు పురందేశ్వరి రిపోర్ట్ ఇచ్చారు. అయినా తగ్గలేదు., సొంత పార్టీ కన్నా వైసీపీనే ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత నేతల గౌరవాన్ని కాపాడలేని హైకమాండ్… రేపు తమ గౌరవాన్ని ఎలా కాపాడగలదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.