తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్షలతో చేసిన అక్రమ అరెస్ట్ నుంచి మధ్యంతర బెయిల్ పై విడుదలైన సందర్భంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా, పెర్త్ నగరం లో నివసిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అందరూ కలిసి, ఈ సందర్భంగా ఆయన అరెస్టుకు నిరసనగా గత రెండు నెలలుగా చంద్రబాబు గారికి సంఘీభావం ప్రకటిస్తూ, పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజాసేసే పరమావధిగా, భవిష్యత్తు భావితరాల కోసం ఆలోచించే నాయకుడు తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాల ప్రతిఫలం పొందిన వారి ఆశీస్సులతో, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, తెలుగుదేశం పార్టీ అంతిమ విజయం సాధించే వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు.
ఈ సందర్భము గా చంద్రబాబుకి సంఘీభావంగా “వి స్టాండ్ విత్ సిబిఎన్”, “ఐ యామ్ విత్ సిబియన్” ప్లకార్డులు ప్రదర్శించారు.
అంతేకాకుండా రాజకీయ కక్ష పూరితంగా ఆధారాలు లేని కొత్త కొత్త కేసులతో చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వైస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి అభిమానులు శ్రీనివాస్ బోయపాటి, మధుబాబు ఆండ్రా, మనోజ్ మల్ల, కవిత, పవన్ మద్దిపాటి, రాజేష్ మోటూరి, డాక్టర్ శ్రీజ కొత్తపల్లి, స్వప్న, హరి ఉన్నవ, దీప్తి, మధు మారౌతు, రావు పెనికలపాటి, రఘు విడియాల, వేణు కడలి, ప్రభాకర్ లక్కంసాని, అనుదీప్ కోయ, హరీష్ దేవినేని, భాస్కర్ కరి, శ్రీకాంత్ ముట్పూరి, కిరణ్ బండ్ల తదితరులు పాల్గొన్నారు.