ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కావాలంటే అప్పు ఇస్తాం కానీ… రావాల్సిన నిధులు మాత్రం ఏదో వంకతో ఆపేస్తామని కేంద్రం అంటే.. నోరు ఎత్తలేని నిస్సహాయ స్థితికి సీఎం జగన్ రెడ్డి చేరిపోయారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాజన్న, జగనన్న అని పేర్లు పెట్టి అమలు చేయడం జగన్ రెడ్డికి మామూలే. చివరికి ఆస్పత్రుల్లో పేషంట్లకు ఇచ్చే ఓపీ చీటీకి తన పేరు పెట్టుకున్న ఘనత ఆయనది. అయితే ఇంత కాలం పట్టించుకోని కేంద్రం ఇప్పుడు… ఆ ప థకాలకు డబ్బులు ఇవ్వడం ఆపేసింది. ఆ పథకం పేరు మారింది కాబట్టి డబ్బులివ్వబోమని చెబుతోంది.
సెంటు స్థలాలిచ్చి ఇళ్లు కట్టిస్తామని నాలుగున్నరేళ్ల నుంచి చెప్పిందే చెప్పి బాదేస్తున్న జగన్ రెడ్డి… ఇప్పటి వరకూ కట్టిందేమీ లేదు. కానీ కేంద్రం నుంచి చాలా కట్టించామని చెప్పి మొండిగోడల ఇళ్లు చూపించి పెద్ద ఎత్తున నిధులు పొందాలనుకున్నారు. ఆ ఇళ్లు కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించినవి చెబుతూ … నిధుల కోసం బిల్లులు పెట్టుకున్నారు. కానీ కేంద్రం వాటిని తిరస్కరించింది. అది కేంద్ర పథకం కాదని తేల్చేసింది. దీంతో ఆ నిధులు రావడం పెండింగ్ లో పడిపోయింది. జగన్ రెడ్డి పేర్ల పిచ్చి కారణంగా ఈ నష్టం ఏపీకి వచ్చింది.
కేంద్ర నిధులు ఉండే పథకాలకు జగన్ రెడ్డి పెట్టడంఅనేది కామన్. అన్నీ ఆయనే ఇస్తున్నారని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. లక్షల కోట్ల అప్పులు తెస్తున్నారు కానీ కేంద్ర నిధులతో పథకాలు అమలు చేస్తున్నారు. మిగతా డబ్బులన్నీ ఏమవుతున్నాయో అనేది పెద్ద పజిల్. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా గట్టిగా అడిగే పరిస్థితి లేదు. అప్పులు ఇస్తే చాలని.. నిధులు అక్కర్లేదన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించేందుకు ఎన్ని అడ్డగోలు మార్గాల్లో వెళ్లాలో ప్రభుత్వం అన్ని అడ్డగోలు మార్గాల్లో వెళ్లింది. ఈ నష్టం జగన్ రెడ్డికి కాదు.. రాష్ట్ర ప్రజలకు…. రాష్ట్రానికే.