కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి టిక్కెట్ ఖరారు చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. దీంతో రేవంత్ రెడ్డితో కేసీఆర్‌కు హైవోల్టేజ్ పోరు జరగనుంది. కామారెడ్డిలో కేసీఆర్‌కు అంత తేలిక కాదన్న వాదన ముందు నుంచీ ఉంది. కేసీఆర్ సీఎం … ఆయన స్టేట్ లీడర్ అనే క్రేజ్ తో ఓట్లు వేసేస్తారని బీఆర్ఎస్ అనుకోవచ్చు కానీ.. పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. రేవంత్ రెడ్డిలాంటి బ లమైన ప్రత్యర్థి ఉంటే… . టఫ్ ఫైట్ ఉంటుంది.
కామారెడ్డిలో బీఆర్ఎస్ ఎప్పుడూ అంత బలంగా లేదు. ఉద్యమం అత్యంత తీవ్రంగా ఉన్న సమయంలో .. ఇతర చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులుక ఏకపక్షంగా యాభై వేల ఓట్ల మెజార్టీ వచ్చిన సందర్భాల్లోనూ కామారెడ్డిలో బీఆర్ఎస్ గట్టిపోటీ ఎదుర్కొంది. స్వల్ప తేడాతోనే విజయాలు సాధించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కామారెడ్డి సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యం లభించింది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ వస్తుంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2019లో మదన్ మోహన్ రావు పోటీ చేశారు. ఆయన కు కామారెడ్డివో 65679 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్‌కు కేవలం 49258 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఏకంగా పదహారు వేల ఓట్ల తేడా ఉంది.
అదే సమయంలో కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ సహా అనేక సమస్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల వచ్చాయి. రైతులు తీవర్ ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్‌పై నామినేషన్ వేస్తామని ఇప్పటికే వంద మంది రైతులు ప్రకటించారు. గతంలోలా ఇప్పుడు సెంటిమెంట్ పవనాలు లేవు. బీఆర్ఎస్ పై పోటీ చేయడం తెలంగాణపై కుట్ర అంటే.. నమ్మే స్టేజ్ దాటిపోయింది. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు ఎదురైన సమస్యల్నే ఎక్కువగా గుర్తు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే కామారెడ్డిలో హై వోల్టేజ్ పోరు ఖాయంగా కనిపిస్తోంది.