రాజకీయ ప్రచారం కోసం ప్రభుత్వ ఉద్యోగుల్ని వాడుకోవడానికి జగన్ రెడ్డి ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తాను ప్రభుత్వాధిపతిని, పార్టీకి అధిపతిని కానీ.. పార్టీ కోసం ప్రభుత్వాన్ని వాడుకోకూడదని ఆయన అర్థం చేసుకోవడం లేదు. చేసుకున్నా.. అంతా నా ఇష్టం అనే పద్దతిలో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలతో గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో అధికారుల్ని పంపి… మీకు ఇన్ని లక్షలు ఇచ్చమని అన్ని కుటుంబాల్ని బెదిరించినంత పని చేసినా ప్రభుత్వం.. ఇప్పుడు జగన్ రెడ్డికే ఓటేయాలని చెప్పేందుకు ఉద్యోగులందర్నీ ఇళ్ల మీదకు పంపేందుకు సిద్ధమైంది. దానికి వై ఏపీ నీడ్స్ జగన్ అనే పేరు పెట్టారు.
వై ఏపీ నీడ్స్ జగన్ అంటే.. అదేదో పార్టీ కార్యక్రమం అనుకుంటారు. నిజంగానే అది పార్టీ ప్రచారం. కానీ ప్రచారం చేసేది మాత్రం వైసీపీ కార్యకర్తలు కాదు.. కలెక్టర్ల నేతృత్వలో ఉద్యోగులు. ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచి గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని… గ్రామాల వారీగా ఎంత నగదు బదిలీ చేశాం.. .. ఎంతమంది ఎలా లబ్ధి జరిగింది అన్నదానిపై ప్రతి ఒక్కరికీ వివరాలు అందించాలని జగన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాల వారీగా ఏయే పథకాల ద్వారా లబ్ధిపొందారో చెప్పాలని… . గ్రామాలవారీగా ఎంత మంచి జరిగిందో చెప్పాలని కలెక్టర్లకు నిర్దేశించారు. ఏ పథకం ఎలా పొందాలో వారికి తెలియాలంటున్నారు. ఒకవేళ ఎవరికైనా ఏమైనా అందకపోతే వారికి అందించేలా చర్యలు తీసుకోవాలని అందుకే వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పుకొస్తున్నారు.
ఇలా కలెక్టర్లతో కూడా వైసీపీ ప్రచారం చేయించుకోవడం ఏమిటని ఎవరైనా విమర్శిస్తే.. . దాన్ని పట్టించుకునే రోజులు లేవు. ఎందుకంటే.. అంత కంటే ఘోరాలు ఈ ప్రభుత్వంలో ఎన్నో జరుగుతున్నాయి. అధికారులు పూర్తిగా విలువలు వదిలేశారు. ప్రజలుఅంటే వైసీపీ కార్యకర్తలు మాత్రమే నని.. వారి కోసం పని చేస్తే చాలన్నట్లుగా వ్యవహరించడం ప్రారంభించారు. నేరుగా పార్టీ కారక్యక్రమాల్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇంత కంటే ప్రజాస్వామ్య ద్రోహం ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా జరగదేమో ?