ఆంధ్రప్రదేశ్ దివాళా తీసే అవకాశముందని ప్రఖ్యాత రెటింగ్ సంస్థ క్రిసిల్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఆంధ్ర ప్రభుత్వ బాండ్స్ రిస్క్ అని డౌన్ గ్రేడ్ చేసి .. రేటింగ్ నెగెటివ్ వాచ్ లిస్ట్ లో పెట్టింది క్రిసిల్.. BSA, DSRA అకౌంట్స్ లో 525 కోట్లు మినిమమ్ బాలన్స్ మెయింటెయిన్ చెయ్యాల్సి ఉంటుంది. అయితే ఆంధ్ర ప్రభుత్వం కేవలం 231 కోట్లే మెయింటెయిన్ చేస్తున్నారు .. అలాగే విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ .. ఆంధ్ర రెవెన్యూ డెఫిసీట్ 43 వేల కోట్లకి చేరి .. Debt/Gsdp 42% చేరింది. అందుకే ఆంధ్రతో జాగ్రత్త అని నెగెటివ్ లో పెట్టామని క్రిసిల్ ప్రకటించింది.
ఏపీకి అప్పులు ఎవరు ఇవ్వాలన్నా… ఈ రేటింగ్స్ ను ప్రామాణికంగా తీసుకుంటారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ల వంటి చోట్ల బాండ్లను అమ్మకానికి పెట్టాలంటే ఈ రేటింగ్ ఉండాలి. గతంలో చంద్రబాబు హయాంలో అమరావతి బాండ్లు వేలం వేసినప్పుడు ఏ ప్లస్ ప్లస్ రేటింగ్ వచ్చింది. రూ. పదమూడువందల కోట్ల కోసం బాండ్లు రిలీజ్ చేస్తే గంటలో రెండు వేల కోట్లకు సబ్ స్క్రైబ్ అయ్యాయి. అప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్ ఇలాంటి బాండ్ల వేలం వేస్తే మొత్తంగా పద్దెనిమిది వందల కోట్లు కూడా అమ్మలేకపోయాయి. అలాంటి పరిస్థితి నుంచి నేడు ఆంధ్ర బాండ్స్ తో జాగ్రత్త అని హెచ్చరిక జారీ చేసే పరిస్తితికి సీఎం జగన్ రెడ్డి తెచ్చారు.
జగన్ రెడ్డి తాను అమరావతిని నాశనం చేశాననో.. … మరొకటో అనుకుంటూ ఉండవచ్చు కానీ.. ఆయన నాశనం చేసింది ఏపీ భవిష్యత్‌ను.. ఆంధ్ర భవిష్యత్ తరాల్ని. తప్పుడు అప్పులు ఇచ్చేందుకు కేంద్రం రెడీగా ఉండవచ్చు కానీ..ఇలాంటి సంస్థల రేటింగ్ వల్ల అంతర్జాతీయగా దేశానికి కూడా చెడ్డపేరు వస్తుంది. ఏపీ కూడా దేశంలో భాగమే. ఇలాంటి దివాలా స్థితిలో ఉన్న రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావు. ఇంత ఘోరమైన పరిస్థితిని ఉద్దేశపూర్వకంగా ఏపీకి కల్పించింది జగన్ రెడ్డి.