విషాదం: చంద్ర‌మోహ‌న్ క‌న్నుమూత‌

ప్ర‌ముఖ న‌టుడు చంద్ర‌మోహ‌న్ (79) క‌న్నుమూశారు. హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ కొద్ది నిమిషాల క్రితం తుదిశ్వాస విడిచారు. 1966లో సినీ రంగ ప్ర‌వేశం చేసిన చంద్ర‌మోహ‌న్.. దాదాపు 950 చిత్రాల్లో న‌టించారు. కేవ‌లం హీరోగానే 175 చిత్రాల్లో మెరిశారు. ప‌ద‌హారేళ్ల వ‌య‌సు లాంటి చిత్రాలు ఆయ‌న‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా విభిన్న‌మైన పాత్ర‌లు పోషించారు. కొద్ది రోజులుగా ఆయ‌న ఆరోగ్యం బాలేదు. హైద‌రాబాద్ అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ… క‌న్నుమూశారు.

చంద్ర‌మోహ‌న్ అస‌లు పేరు మ‌ల్లంప‌ల్లి చంద్ర‌శేఖ‌ర్‌. 1942లో కృష్ణాజిల్లాలో ప‌మిడి ముక్క‌ల గ్రామంలో జ‌న్మించారు. రంగుల‌రాట్నం చిత్రంతో కెమెరా ముందుకు వ‌చ్చారు. చంద్ర‌మోహ‌న్‌కి ఓ భార్య‌, ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లో చంద్ర‌మోహ‌న్ అంత్యక్రియ‌లు నిర్వ‌హిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close