ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలకులు చేస్తున్న పాలన, రాజకీయం ప్రజాస్వామ్యానికే కాదు… దేశంలో ప్రజల మధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టడంలో ఓ కొత్త తరహా ఉన్మాదానికి నాంది పలుకుతోంది. పన్నులు కట్టే వాళ్లని పీడించి. పిప్పి చేసి.. వసూలు చేసిన దాంట్లో కొంత ఓటు బ్యాంక్ కు పంచి.. మిగతాది బడా కాంట్రాక్టర్లకు చెల్లించేస్తున్నారు. రాను రాను పిండుడు ఎక్కువైపోవడంతో పన్నులు కట్టే వర్గాల్లో అసహనం పెరిగిపోతోంది.
ప్రభుత్వానికి సగం ఆదాయం చెల్లిస్తున్న ఏపీలో మధ్యతరగతి జీవులు
ఆంధ్రప్రదేశ్ లో కులాలకు అతీతంగా మధ్యతరగతి ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. వారికి అర్హతల పేరుతో ఒక్క పథకం అందదు . కానీ ప్రభుత్వం ni అమలు చేసే ప్రతి ప థకానికి డబ్బులు వారే సమకూర్చుకోవాలి. ఇటీవలి కాలంలో ప్రతీ దానికీ వడ్డింపు అయిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ చార్జీలు, పెట్రోల్ డీజిల్ చార్జీలు ఇలా లెక్కలేసుకుంటూ పోతే.. కుటుంబ ఖర్చులు నెలకు నెలకు.. రెండు, మూడు వేల చొప్పున పెరిగిపోతూ ఉంది. దానికి కారణం ప్రభుత్వం ఆదాయంకోసం అడ్డగోలుగా ప్రత్యక్ష , పరోక్ష పన్నులు వడ్డిస్తూండటమే. ఎలా చూసినా నెలకు ఏదో తిప్పలు పడి నెలకు ఓ ముఫ్పై వేలు సంపాదించుకునే కుటుంబం.. వివిధ పన్నుల పేరుతో ప్రభుత్వం వడ్డించిన దానికి సగం చెల్లించుకోవాల్సి వస్తోంది. అన్నీ నిత్యావసరంగా చేయాల్సిన ఖర్చుల్లో కలిపి దోచేస్తూండటంతో సామాన్యుడికి తప్పడం లేదు.
ఓటు బ్యాంక్ కు కూడా ఇచ్చేది కొంత – లాక్కునేది ఎంతో ?
ఓ వైపు కులమతాలకు అతీతంగా మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ నిలువుదోపిడీకి గురవుతున్నారు. వారికి పథకాలేమీ అందవు కాబట్టి తిరిగి వచ్చేదేమీ లేదు. ఓటు బ్యాంక్‌కు కొంత పంపిణీ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అదీ కూడా ఆలస్యమవుతోంది. అయితే వారికి ఇస్తున్నారా అంటే.. ఇస్తున్నారు.. కానీ వారి దగ్గరా అంతకు మించి పిండేస్తున్నారు. నిరుపేద కుటుంబాల్లో ఎవరికైనా మద్యం అలవాటు ఉన్నట్లయితే.. ప్రభుత్వం ఇచ్చేదాని కన్నా.. ఆ కుటంబం నుంచి పీల్చుకునేది ఎక్కువ. ఆ విషయం ఆ కుటుంబాలకూ అర్థమవుతోంది. ఇలాంటి వాళ్లు సగానిపైగా ఉంటారు. అంటే.. ఓటు బ్యాంకుకూ ఏపీ అధికార పార్టీ చేస్తున్నదేమీ లేదు.
దీనినే పాలన అంటే… ప్రజాస్వామ్యం ఏమైనాపోవాలి ?
అధికారం అందుకునేది ప్రజల్ని ఉద్దరిస్తామనే కానీ.. సగం మంది దగ్గర దోచేసి.. మిగిిన సగం మందికి పెట్టేద్దామని కాదు. అలా చేయడానికే అధికారం అయితే….దానికి రాజకీయం అవసరం లేదేమో? ప్రజలంతా ఎవరికి వారు ప్రభుత్వాలే కాదు.. ఎవరి మీద ఆధారాపడకుండా.. తమ స్వశక్తితో ఎదిగేలా చేయడమే ప్రభుత్వాల పని. అలా చేయకుండా డబ్బులు పంచడమే రాజకీయం అయితే ఇక ఎవరూ ఏమీ చేయలేరు.