ఏపీ ప్రభుత్వం ప్రతి స్కీములోనూ దారుణమైన స్కామ్‌లకు పాల్పడుతోంది. బైజూస్, ఐబీ పేరుతో విద్యా వ్యవస్థలో జరిగిన అవినీతిని జనసేన బయట పెట్టింది. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారని నాదెడండ్ల మనోహర్ బయట పెట్టారు. తర్వాత జగన్ రెడ్డి పాపాల వెల్లువ అంటూ… లక్,ల గెదెల్ని కొన్నట్లుగా చూపించి దాదాపుగా మూడు వేల కోట్లు కొట్టేసిన వైనం కూడా వెలుగులోకి తెచ్చారు. దీన్ని సమర్థించుకోవడానికి వైసీపీ దగ్గర ఆన్సర్ లేదు. దీంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది.
ఈ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ అవినీతికి పాల్పడిందని.. తమ దగ్గర పూర్తి సమాచారం ఉందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పధ్నాలుగో తేదీ నుంచి ఒక్కో స్కాం గురించి బయటపెడతామని ప్రకటించారు. స్కాం అంటే ఆరోపణలు చేయడం కాదు. పూర్తి స్థాయిలో ఆధారాలతో… ప్రజాధనం ఎలా దోపిడీకి పాల్పడ్డారో వివరిస్తామని చెబుతున్నారు. పేదల పేరుతో వారికి రూపాయి అయినా మంచి చేశారో లేదో కానీ… వేలకోట్లు దిగమింగారన్నది మాత్రం స్పష్టమైందని జనసేన నేతలు చెబుతున్నారు.
ఈ ప్రభుత్వంలో అవినీతి పూర్తి స్థాయిలో వ్యవస్థీకృతం అయిపోయింది. ఎంత ఘోరం అంటే ఏ పథకం అయినా అరవై, డెభ్బై శాతం నిధులు … పెద్దల ఖాతాల్లోకి వెళ్లిపోతున్నాయి. మిగిలిన నిధులతో పథకాలు అమలు చేస్తున్నారు. దీంతో లబ్దిదారులకు అందడం లేదు. ఈ ప్రభుత్వ అవినీతిపై లబ్దిదారులు, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దీన్ని జనసేన బయటపెట్టే విషయాలు మరింత పెంచనున్నాయి.