మేరా పాస్ పవన్ కల్యాణ్ హై అన్నారు బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ. మోదీ అంతటి నేత.. పవన్ తనతో ఉన్నాడు కాబట్టి ఇక తనకు ఎదురు లేదని ధీమాగా అన్నాడంటే.. పవన్ ఎంత పవర్ ఫుల్ లీడర్ అయి ఉండాలి ?. అలాగే మందకృష్ణ మాదిగనూ మోదీ పొగిడారు. వర్గీకరణ ఉద్యమంలో మా నాయకుడు మందకృష్ణే అన్నారు. అంటే.. విశ్వగురు మోడీనే తన గురువు మందకృష్ణ అని చెప్పుకున్నట్లయింది. వారిపై నిజంగా అంత గొప్ప అభిప్రాయం ఉంటే… వారి ఫేట్ ఇప్పటికే ఎంతో మారిపోయి ఉండేది. ఇలా ఉండేది కాదు. కానీ ఇప్పుడెందుకు వారిని అలా ఉబ్బేస్తున్నారు. అక్కడే ఉంది రాజకీయం. సామాజిక శాస్త్ర రాజకీయం.
తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం పూర్తిగా కులాల లెక్కల్నే చూసుకుంటోంది. ఇందు కోసం మూడు సామాజికవర్గాలపై పెద్ద ప్లాన్ వేసింది. పరోక్షంగా ఓ అగ్రకులాన్నీ దువ్వుతోంది. బీసీ ముఖ్యమంత్రి నినాదం… ఎస్సీ వర్గీకరణ హామీ… పవన్ కల్యాణ్ సాయంతో కాపు ఓట్లు.. ఈ మూడు కలిస్తే గెలిచేస్తామని బీజేపీ ఆశలు పెట్టుకుంది. పనిలో పనిగా రెడ్డి సామాజికవర్గానికీ … పరోక్షంగా లవ్ లెటర్లు పంపుతోంది. ఆ ప్రకారమే పని చేసుకుంటూ పోతోంది. మోదీకి ఎస్సీ వర్గీకరణ అనేది పెద్ద సమస్య కాదు. ఇట్టే పరిష్కారం చూపలగరు కానీ ప్రతిపక్షంలో ఉన్నట్లుగా పోరాటానికి అండగా అంటామన్నారు. అక్కడే రాజకీయం అర్థమైపోతుదంి.
జనసేనకు తెలంగాణలో కనీస బలం లేదు. గత పార్లమెంట్ ఎ్నికల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు సాధించిన ఓట్లు 85వేలు మాత్రమే. ఆ తర్వాత కూడా జనసేన పార్టీకి నిర్మాణం లేదు . క్యాడర్ లేదు. ఇంకా అసలు ఎలాంటి ప్రజాందోళన కార్యక్రమాలూ నిర్వహించలేదు. మరి ఏం బలం ఉందని బీజేపీ పవన్ పై ఒత్తిడి తెచ్చి మరీ పొత్తులు పెట్టుకుంది. అక్కడే ఉండి అసలు సామాజిక సమీకరణ రాజకీయం. బీసీ, మాదిగ, కాపు కాంబినేషన్ తో హిట్ కట్టాలని బీజేపీ తాపత్రయం.
ఈ సామాజిక సమీకరణంలో ఎవరూ ఊహించని మరో కోణం కూడా ఉంది. అది రెడ్డి వర్గాన్ని ఆకట్టుకోవడం. తెలంగాణలో రెడ్డి సామాజికవర్గాన్ని కాదని రాజకీయం చేయడం అంత తేలిక కాదు. రాజకీయపార్టీలు ప్రకటించిన జాబితాను చూస్తే ఇది అర్థం అయిపోతుంది. బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలనుకున్నారు కాబట్టి రెడ్డి నేతలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పోస్టు ఇచ్చారు. అంతర్గతంగా బీజేపీకి ఇచ్చే ప్రాధాన్యం తగ్గలేదని సందేశం పంపారు. కానీ మోదీ గేమ్ ప్లే చేస్తున్నారు కానీ.. ఆ వర్గాలు పట్టించుకుంటున్నాయా అన్నదే ఎవరికీ ఇంకా క్లారిటీ రాని అంశం.