గ్రౌండ్ లో శ్రీలంకను ఓడించడం అందరూ చేస్తారు కానీ. . అసలు శ్రీలంక క్రికెట్ ను సర్వనాశనం చేసే వారికే ఓ రేంజ్ ఉంటుందని ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఆ దేశ క్రికెట్ కు ఏమైనా అయితే ఆ దేశ క్రికెట్ పాలకులు చేసుకోవాలి.. కానీ ఇక్కడ జరిగింది వేరు. శ్రీలంక క్రికెట్ సర్వ నాశనం అవడానికి బీసీసీఐని ఒంటి చేత్తో నడిపించేస్తున్న అమిత్ షా కుమారుడు జేషా నే కారణమట. ఈ విషయాన్ని అర్జున రుణతుంగ ప్రకటించారు. బీసీసీఐని చెప్పు చేతల్లో ఉంచుకున్న జే షా.. శ్రీలంక క్రికెట్ బోర్డులోనూ వేలు పెట్టారట. డబ్బు బలంతో.. శ్రీలంక క్రికెట్ బోర్డులోని వారిని లోబర్చుకుని.. క్రికెట్ నాశనానికి కారణమయ్యారట.
అర్జునరణతుంగ చేసిన ప్రకటనపై.. క్రికెట్ వర్గాల్లో సంచలనం అవుతోంది. శ్రీలంక క్రికెట్ పరిస్థితి దారుణంగా తయారైంది. వరుస ఓటములతో.. క్రికెట్ బోర్డును అక్కడి ప్రభుత్వం రద్దు చేింది. క్రికెట్ బోర్డులో ప్రభు్తవాలు జోక్యం చేసుకున్నాయని ఐసీసీ అసలు శ్రీలంక క్రికెట్ నే సస్పెండ్ చేసింది. దీంతో మొదటికే మోసం వచ్చినట్లయింది. అసలు శ్రీలంక దుస్థితికి కారణం ఎవరనేది రణతుంగ బయటపెట్టారు. జే షా మరికొంత కాలంలో ఇండియా క్రికెట్ కు కూడా అదే గతి పట్టిస్తారని కొంత మంది సైటైర్లు వేస్తున్నారు. అసలు క్రికెట్ కు.. జే షాకు సంబంధంలేదు.
అమిత్ షా కుమారుడున్న కారణంగానే మెల్లగా బీసీసీలో చేరిపోయారు. చివరికి ఆయన తప్ప ఎవరూ లేరన్నట్లుగా చక్రం తిప్పేస్తున్నారు. కొన్నాళ్లు సౌరభ్ గంగూలీని అధ్యక్షుడిగా పెట్టారు. తర్వాత తప్పించారు. ఎవరు చీఫ్ గా ఉన్నా.. మొత్తం పెత్తనం జే షా అండ్ టీం చేస్తుంది. శ్రీలంక క్రికెట్ విషయంలో రణతుంగ చేసిన ఆరోపణలపై జే షా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.