టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఓ ధీమ్కు క్రియేట్ చేసుకున్నాయి. జగన్ పాలన వల్ల నష్టపోయిన ప్రతీ వర్గం మళ్లీ కోలుకునేలా.. వారికి మేలు చేసేలా పథకాలు పెట్టాలని డిసైడయ్యారు. జగన్ రెడ్డి సర్కారులో చివరికి రేషన్ బియ్యం కూడా నిరుపేదలకు సక్రమగా చేరడం లేదు. ప్రతి వర్గం నష్టపోయింది. అందుకే అందరికీ మేలు చేసేలా మేనిఫెస్టోను ప్రిపేర్ చేయనున్నారు.
తొలి సారి జరిగిన ఉమ్మడి మేనిఫెస్టో సమావేశంలో తెలుగుదేశం-జనసేన కలిపి 11 అంశాలతో మినీ మేనిఫెస్టోపై ఓ అంచనాకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సూపర్ 6 పేరుతో పథకాలను ప్రకటించింది. వీటికి తోడు జనసేన ప్రతిపాదించిన 5 అంశాలకు అంగీకారం తెలిపారు. జనసేన ప్రతిపాదించినట్లుగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు 10లక్షల వరకు సబ్సిడీ , ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు ఉండనున్నాయి.
పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం వంటివి కొత్తగా మినీ మేనిఫెస్టోలో చేర్చారు. రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి. వివిధ వర్గాలకు ఇప్పటివరకు లేని సమస్యలను జగన్ సృష్టించారని ఈ సమస్యలను పరిష్కరించే అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తామని రెండు పార్టీలు చెబుతున్నాయి. తుది మేనిఫెస్టో విడుదల చేసే ముందు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో చర్చించాలని నిర్ణయించారు.
సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాభివృద్ధికి పెద్ద పీట వేసేలా ప్రణాళికలు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేయనున్నారు. అసమానతలు తొలిగి ఆర్ధిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికలు చేస్తున్నారు. మేనిఫెస్టోను రూపొందించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశాలను ఇప్పటికే ప్రారంభించారు.