జర్నలిస్టులకు ఇంటి స్థలాలంటూ జగన్ రెడ్డి సర్కార్ ఓ జీవో జారీ చేసింది. అందులో ఉన్న అర్హతల గురించి తర్వాత.. ముందు అసలు ఆ జీవో చెల్లుతుందా అనే డౌట్ జర్నలిస్టులకు వచ్చింది. ఎందుకంటే అసలు జారీ చేసిన జీవోకు నెంబర్ లేదట . ముందు జీవోకు నెంబర్ ఇస్తే… తర్వాత ఫలానా నెంబర్ జీవో ప్రకారం.. ఇళ్ల స్థలాల కోసం అప్లైచేసుకుంటారని వేడుకుంటున్నారు. కానీ జీవో ఓ సారి.. నెంబర్ ఓ సారి ఇచ్చే విధానం కూడా ప్రభుత్వం ప్రారంభించిందేమో కానీ… జర్నలిస్టులు మాత్రం కామెడీ చేస్తున్నారు.
ఎన్నికలకు నాలుగు నెలల ముందు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలంటూ జగన్ రెడ్డి ఇచ్చిన చెల్లని జీవోలో ఉన్న అర్హతలు అచ్చంగా జగన్ రెడ్డి లబ్దిదారుల్ని ఎంపిక చేసే విధంగానే ఉన్నాయి. 98 శాతం మందిని అనర్హుల్ని చేసి… తమకు చెందిన ఓ రెండు శాతం మందికి కొన్ని చోట్ల అప్పనంగా ఇళ్ల స్థలాలు కట్టబెట్టే కుట్రలో భాంగానే ఈ జీవో జారీ అయింది. స్థలం ఉచితంగా కాదు… కనీసం నామినల్ గా కాదు.. నలభై శాతం జర్నలిస్టు కట్టాలి. దీనికోసమైనా జర్నలిస్టు భార్యకుగానీ, జర్నలిస్టుకుగానీ తాను సొంతంగా సంపాదించుకుని లేదా వారసత్వంగా వచ్చిన ఇల్లు ఉన్నా సరే ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలానికి అర్హులు కాదని తేల్చారు.. అంతేనా ఇంకా అక్రిడేషన్లు…. ఇతర రూల్స్ ఉన్నాయి. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లోనే పని చేయాలన్నారు.
ఇలా చెప్పుకుంటూపోతే హామీని నెరవేర్చామని చెప్పుకునేందుకు ఇతర అన్ని పథకాల్లాగే.. జీవోలు జారీ చేసినట్లుగా ఉందని చెబుతున్నారు. అర్హతల పేరుతో ఎవరికీ అర్హతలు లేకుండా చేసింది.. నలుగురు ఐదుగురు తన వారికి ప్రచారం చేసుకుని హామీలు నెరవేర్చామని చెప్పుకోవడం కామన్ అయింది. జర్నలిస్టులకూ ఇది తప్పడం లేదు.