తెలంగాణ ఎన్నికల్లో అఫిడవిట్లపై ఎక్కువ మంది అభ్యర్థులు దృష్టి పెట్టారు. తాము తప్పులు చేయకుండా ఉండటమే కాదు.. ప్రత్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లలో తప్పులు వెదకడానికి కూడా నిపుణులతో యంత్రాంగాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యర్థులు నామినేషన్ పత్రాలల్లో పేర్కొన ఆస్తులు, కేసుల వివరాలను సేకరిస్తూ వాటిపై ఆరా తీస్తున్న నేతల సంఖఏ్య ఎక్కువగా ఉంది. ఈ ఎన్నికల్లో ఓటమి చెందితే గెలుపోందిన అభ్యర్థి పై ప్రతీకారం తీర్చుకునేందుకు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని అంటూ న్యాయస్థానం మెట్లు ఎక్కేందుకు ఇవి ఉపయోగపడతాయి.
గత ఎన్నికల్లో గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలు ఇదే సమస్యతో ఎన్నికల రద్దయ్యే పరిస్థితి వచ్చింది. కొంత మందికి హైకోర్టులో ఊరట లభించింది. ఇద్దరు పదవి కోల్పోతే సుప్రీంకరోర్టుకు వెళ్లి మధ్యంతర స్టే తెచ్చుకుని తీర్పును వాయిదా వేయించుకున్నారు. అందుకే అన్ని పార్టీల అధినేతలు ముందుగానే అఫిడవిట్లను ప్రిపేర్ చేసుకోవడానికి ప్రత్యేక ఆడిటర్, న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలన చేయిస్తూ లోపాలు గుర్తించే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. పార్టీల పరంగా కూడా సహకారం అందించారు.
అప్రమత్తంగా ఉండాలి కాబట్టి గెలుస్తామని నమ్మకం ఉన్న వారంతా… ఆడిటర్, న్యాయవాదితో నామినేషన్ పత్రాలు నింపి ఎన్నికల అధికారులు సమర్పించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా ఇతర పార్టీల నుంచి పోటీ చేసే నాయకుల ఆఫిడవిట్లకు సంబంధించిన వివరాలు తీసుకోవడంపై ఎన్నికల అధికారులు సైతం కొత్త ట్రెండ్ ప్రారంభమయిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.