జగన్ రెడ్డి సర్కార్ ఎన్నికలకు ముందు బెదిరింపులు, కుట్ర రాజకీయాలు.. కుల రాజకీయాలు చేసుకుంటూ పోతోంది. బీసీ జనగణన అంటూ… పద్దతి పాడూ లేకుండా రాజకీయ సర్వేల్లా యాప్ ఓ ప్రక్రియ ప్రారంభించే ముందు.. 21 కులాల్ని ప్రాంతాల వారీగా విభజిస్తూ.. బీసీ కులాల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం…శెట్టిబలిజలు ఇక రాయలసీమలో బీసీలు కాదు. ఓసీలు. అదే ఇతర ప్రాంతాల్లో బీసీలు. ఇలా మొత్తం 21 కులాలపై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ 21 కులాలు రాష్ట్రం మొత్తం బీసీ హోదా పొందలేరు. కొన్ని కొన్ని ప్రాంతాల్లోని కులాల వారికే బీసీ హోదా వస్తుంది. మిగతా వారు ఓసీలు.
ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏదైనా ఆ 21 బీసీ కులాల ప్రజలు , యువత మాత్రం తీవ్రంగా నష్టపోనున్నారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమయింది. తెలంగాణలో స్థిరపడిన ఉత్తరాంధ్రకు చెందిన 23కులాలను తెలంగా ణ బీసీ కులాల జాబితా నుంచి తెలంగాణ ఏర్పడిన కొత్తలో తొలగించారు. ఆసమస్య పేరు చెప్పి… ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ లో చేరిపోయారు.. పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు తెలంగాణ సర్కార్ తో మాట్లాడతామన్నారు. కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఇప్పటికీ ఆ సమస్య అలాగే ఉంది.
ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తాము ప్రాంతాల వారీగా బీసీ కులాల్ని చీల్చి ఓసీలుగా గుర్తిస్తోంది. అయితే ఇక్కడ పొలిటికల్ ట్రిక్స్ ప్లే చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లను భయపెట్టి ఆందోళనలు చేయించి.. చివరికి ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుని… ఏదో మేలు చేసినట్లుగా చెప్పుకుని వారితో పాలాభిషేకాలు చేయించుకునే కుట్రలకు పాల్పడుతోందేమో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.