సీఎం జగన్ రెడ్డి పారదర్శక పాలన అందిస్తున్నామని చెబుతూంటారు. కానీ ఆయన విడుదల చేసే జీవోల్లో 99 శాతం ఎవరికీ తెలియవు. రహస్యంగా తీసుకుని మాన్యువల్ పద్దతిలో రిజిస్టర్లలో భద్రపరుస్తూ ఉంటారు. ఆ జీవోల ప్రకారం చేయాల్సిన పనులు మాత్రం.. జీవోల విడుదల కంటే ముందే చకచకా జరిగిపోతూంటాయి. ఆయన చేసిన ఘనకార్యాలన్నీ రహస్య జీవోల్లోనే ఉన్నాయి..
జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన. గతంలో జీవోఐఆర్ వెబ్ సైట్ లో అన్ని జీవోలు ఉండేవి. కాన్ఫిడెన్షియల్ అయితే అదే మాట చెప్పేవారు. కానీ జగన్ రెడ్డి సర్కార్ ఆ వెబ్ సైట్ ను మూత వేసింది. తప్పుడు నిర్ణయాలపై జీవోలు వెలువడగానే కోర్టుల్లో కేసులు పడుతున్నాయని అసలు జీవోల్ని వెబ్ సైట్ నుంచి తీసేసి రహస్యంగా ఉంచడం ప్రారంభించారు. హైకోర్టులో పిటిషన్లు వేసినా… పెద్దగా మార్పు లేదు. కోర్టుల్లో మాయ చేయడానికి విచారణ జరిగినప్పుడు ఇదిగో మొత్తం పెట్టమని ఆదేశాలిచ్చామని ఓ ఉత్తర్వు కోర్టుకు చూపిస్తారు. తర్వాత మామూలే.
కోర్టుల మాటల్నీ ఈ ప్రభుత్వం వినడం లేదు కాబట్టి… రేపు హైకోర్టు.. జీవోలు మొత్తం వెబ్ సైట్ లో పెట్టాల్సిందేనని ఆదేశాలు ఇచ్చినా పెట్టే అవకాశం లేదు. అన్నింటికీ ఉపాయాలు జగన్ రెడ్డి దగ్గర ఉంటాయి. కానీ ఆ జీవోల్లో మాత్రం … జగన్ రెడ్డి సర్కార్ చేసిన అన్ని రకాల అరాచకాలూ ఉంటాయి. వాటిని ఏ అగ్నిప్రమాదంలోనే తగులబెట్టకపోతే… వచ్చే ప్రభుత్వం.. ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లను పెట్టి మరీ అధికారుల్ని అరెస్టులు చేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే .. తప్పుడు పనులకు బాధ్యులయ్యేది వారే మరి. !