మద్యం రేట్ల ను షాక్ కొట్టేలా పెంచి.. తాగేవాళ్లను తగ్గించి.. చివరికి ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యాన్ని పరిమితం ఓట్లు అడుగుతానన్నాడు జగన్ రెడ్డి. ఇందులో మద్యం రేట్లను విపరీతంగా పెంచి షాక్ కొట్టించే వరకూ హామీని పక్కాగా అమలు చేస్తున్నాడు. తాజాగా మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫుల్ బాటిన్ మీద యాభై నుంచి వంద వరకూ వడ్డించారు. క్వార్టర్ పై ఇరవై వరకూ పెంచారు. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు రేట్లు పెంచాల్సి వచ్చిందంటే.. మరోసారి తాగేవాళ్లను తగ్గించాలని జగన్ రెడ్డి గట్టిగా అనుకున్నారన్న సమాధానం అటు వైపు నుంచి వస్తుంది.
కానీ నిజం మాత్రం.. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు. ఆర్బీఐ రుణాలు ఎన్ని తెచ్చినా సరిపోవడంలేదు. ఎన్నికలకు వెళ్లే ముందు అస్మదీయులకు పదిహేను వేల కోట్ల వరకూ బిల్లులు చెల్లించాల్సి ఉంది. అన్నింటికీ నిధుల సేకరణ కష్టమవుతోంది. మరో వైపు పెద్ద ఎత్తున చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. పథకాలు వరుసగా పెండింగ్ లో పడిపోతున్నాయి. నొక్కిన బటన్లకు డబ్బులు పడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత మందుబాబుల్ని పిండుకోవడమే మంచిదని డిసైడయ్యారు.. రేట్లు పెంచేశారు. వచ్చే రెండు నెలల్లో మరిన్ని పెంపుదలలు ఉంటాయన్న సూచనలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రభుత్వం సమయం దగ్గర పడుతుంది. మళ్లీ వస్తుందన్న గ్యారంటీ లేదు. అందుకే మార్చిలోపే అన్ని చెల్లింపులు చేసుకోవాలన్న ఆతృత జగన్ రెడ్డి వర్గీయుల్లో కనిపిస్తోంది. ప్రభుత్వం మారితే పనులన్నీ చెక్ చేస్తారు. అప్పుడు రూపాయి కూడా రాదు. ఎందుకంటే.. కట్టిందేమీ లేదు కాబట్టి. ఎంతైనా… ప్రతీ దానికి మందుబాబులే కనిపిస్తూండటం.. మద్యం అలవాటు ఉన్న కుటుంబాలకను పీల్చిపిప్పి చేయడమే.