ఈరోజుల్లో సినిమా జయాపజయాల్ని నిర్ణయించేవి ఆర్థిక పరమైన గణాంకాలే. సినిమాకి లాభం వస్తే హిట్టు. నష్టమొస్తే ఫ్లాప్. టేబుల్ ప్రాఫిట్ తీసుకొస్తే సినిమా ఫలితం ఎలా ఉన్నా, దర్శకుడిగా పాస్ అయిపోయినట్టే. మంగళవారం విషయంలో అదే జరిగింది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. గురువారం కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లు వేశారు. రివ్యూల పరంగా యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోయింది. అయితే.. ఈ సినిమాకి టేబుల్ ప్రాఫిట్ దక్కడం విశేషం. ఈ సినిమాకి రూ.16 కోట్లు ఖర్చు పెట్టారు. ఓటీటీ రూపంలోనే అందులో సగం వెనక్కి వచ్చేశాయి. కెపాసిటీకి మించిన థియేటర్లలో విడుదల చేయడం వల్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడం లేదు కానీ, ఓవరాల్ గా వసూళ్లు మాత్రం బాగానే ఉన్నాయి. సీడెడ్, నైజాంలతో పోలిస్తే ఆంధ్రాలో మంచి కలక్షన్లు వస్తున్నాయి. ఓవరాల్ గా డిస్టిబ్యూటర్లు హ్యాపీ. ఈ వారం మరో సినిమా పోటీ లేకపోవడం వల్ల, ఉన్న సినిమాలన్నీ మరింత డల్‌గా కనిపించడం వల్ల… మంగళవారం ఒడ్డున పడిపోవడం ఖాయంగా అనిపిస్తోంది. మహా సముద్రం ఫ్లాప్‌తో వెనకడుగు వేసిన అజయ్ భూపతికి ఈ రిజల్ట్ కాస్త ఉపశమనం ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.