లేని స్కిల్ కేసులో ఎవరెవర్నో అప్రూవర్ గా చేసి.. నేరం జరిగిందని నిరూపించాలని సీఐడీ చేసిన ప్రయత్నాలను కార్పొరేట్ వర్గాల్లో కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. సిమెన్స్ మాజీ ఎండీకే పాతిక కోట్ల ఆఫర్ ఇచ్చారు. కాదన్నందుకు శవాన్ని పక్కన పెట్టి ఆయన కణతకు తుపాకీ గురి పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. అయినా ఆయన లొంగలేదు. చివరికి పదమూడో నిందితుడిగా చేర్చిన ఓ కంపెనీ ప్రతినిది చంద్రకాంత్ షా అనే వ్యక్తి అప్రూవర్ అయ్యారని స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు. కోర్టులో అదే చెప్పారు. కానీ ఆయన కోర్టుకు రావడానికి మాత్రం నిరాకరిస్తున్నారు.
గత జనవరిలో ఆయన అప్రూవర్ అని సీఐడీ స్టేట్ మెంట్ తీసుకుంది. ఇంత వరకూ కోర్టులో వాంగ్మూలం ఇప్పించలేదు. ఇటీవల ఇప్పించేందుకు కోర్టుకు పిలిపించారు. ఆయనకు నోటీసులు ఇచ్చారు. కానీ చంద్రకాంత్ షా మాత్రం అడ్రస్ లేడు. దీంతో సీఐడీ అధికారులు నాలిక కరుచుకున్నారు. కేసును వచ్చే నెలకు వాయిదా వేయాలని కోరారు. ఈ చంద్రకాంత్ షా… సీఐడీ వాళ్లిస్తామన్న డబ్బులు తీసుకుని వాళ్లడిగిన స్టేట్మెంట్ ఇచ్చారని..కానీ కోర్టులో చెప్పడానికి మాత్రం సిద్ధంగా లేరని కార్పొరేట్ వర్గాలు చెబుతున్నారు.
అసలు చంద్రకాంత్ షా అనే వ్యక్తి సిమెన్స్ కంపెనీ ప్రతినిధి కాదు. డిజైన్ టెక్ కంపెనీ ప్రతినిధి కూడా కాదు. డిజైన్ టెక్.. ఏపీ స్కిల్ సెంటర్లకు పరికరాలు సరఫరా చేసింది. ఆ పరికాలు కొనుగోలు చేసిన ఓ సంస్థకు సలహాదారుగా ఉన్నారని చెబుతున్నారు. ఆయన పేరును ఎఫ్ఐఆర్లో పెట్టి.. తరవాత భయపెట్టి.. ఆశ పెట్టి అప్రూవర్ కథ రాసుకున్నారు. కానీ ఎంత వ్యక్తి అయినా జరగని తప్పును జరిగినట్లుగా ఎలా చెప్పగలడు. దొరికిపోడా. అందుకే కోర్టుకు రాకుండా పోతున్నారు. సీఐడీ కూడా ఆయనను మళ్లీ ఒప్పించలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది.