తెలంగాణ ప్రజలను బీజేపీ ఓ మాదిరిగా కూడా చూస్తున్నట్లుగా కనిపించడం లేదు. బీజేపీకి ఓటు వేసి గెలిస్తే అయోధ్యకు ఉచితంగా తీసుకెళ్లి దర్శనం చేియంచి తీసుకు వస్తారట. ఖర్చు ఎవరిదంటే.. తెలంగాణ ప్రభత్వానిది. అంటే.. తెలంగాణ ప్రజలది. బీజేపీకి ఓటు వేసి తెలంగాణలో గెలిపిస్తే.. ప్రజల సొమ్ము పెట్టి.. ప్రజల్ని అయోద్యకు తీసుకెళ్లి రాముడి దర్శనం చేయిస్తారన్నమాట. ఇందులో బీజేపీకి పోయేదేముంది ?. ఆకర్షితులయ్యేవారు ఓట్లు వేస్తారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయన గద్వాలలో బహిరంగసభలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి ఖర్చులు భరించి అయోధ్య రామాలయ దర్శనానికి తీసుకెళ్తామన్నారు. మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ ఇదే హామీ ఇచ్చింది. మేనిపెస్టోలో పెట్టింది. తెలంగాణలో కూడా అదే హామీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. బహుశా ఈ హామీని మేనిఫెస్టోలో కూడా పెట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలు ఉచితంగా ఏదో వస్తువులు ఇస్తామనో.. చదువు చెప్పి్సతామనో.. లేకపోతే ఉచితంగా బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేస్తామనో చెబుతూ ఉంటాయి. కానీ బీజేపీ మాత్రం ఉచితంగా దేవుడి దర్శనం చేయిస్తామంటోంది.
ఇంతా చేసి ఆ అయోధ్య రామాలయం ఏమైనా బీజేపీ సొత్తా అంటే..అదీ కాదు. మరి బీజేపీ అయోద్య రామాలంయపై తమకే హక్కు ఉన్నట్లుగా ఎందుకు హామీ ఇస్తోంది ?. బీజేపీ స్టైలే అది. అసలు విషయాలు, సమస్యల కన్నా..ఇతర విషయాలకే ప్రాధాన్యం ఇస్ూంటుంది. పేర్లు మార్పు అందులో ఒకటి. ప్రజల భావోద్వేగాలతో రాజకీయం చేయడం బీజేపీ నేతల పని.