అక్రమ మద్యం వ్యాపారం చేస్తూ దొరికిపోతే రౌడీలు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి మహిళా పోలీసుని చితక్కొట్టి నిందితుల్ని విడిపించుకోపోతారు. నో కేసు. సీఎంవో నుంచి ఆదేశాలు వచ్చాయని ఓ ఆర్థిక నేరగాడ్ని పట్టుకుంటే.. ఓ ఎమ్మెల్యే వచ్చి విడిపించుకెళ్లిపోతాడు. అది ఏపీలో అమలయ్యే రాజారెడ్డి రాజ్యాంగం. ఎవరో ఎక్కడో గొడవ పడితే… దానికి టీడీపీ నేత పేర్లను జత చేసి హత్యాయత్నం కేసులు పెట్టేయడం.. ఏపీలో అమలయ్యే చట్టం. ఇలా చెప్పుకుంటూ పోతే.. రోజూ ఈ తతంగాలు మన కళ్ల ముందే ఉంటున్నాయి. ఏపీలో ఇలా జరిగితే ఆశ్చర్యపడాల్సలింది లేదు.. జరగకపోతే ఆశ్చర్యపడాలన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రయాణిస్తే గుంతల రాజ్యం… అడుగుపెడితే రౌడీల పాలన అన్నట్లుగా ఏపీ మారిపోయింది.
గుంతల రాజ్యానికి స్వాగతం !
ఏపీలో రోడ్లు చాలా బాగుంటాయి.. కానీ అవి జాతీయరహదారులు మాత్రమే. అన్ని చోట్లా జాతీయ రహదారులు బాగుంటాయి. వాటి నిర్వహణ చేసేది కేంద్ం. మరి రాష్ట్రంలో ఉన్న రోడ్ల సంగతేంటి…? జనాలకు డబ్బులు పంచడమే అభివృద్ధి అని.. జగన్ రెడ్డి అండ్ కో అనుకుంటున్నారు. అందుకే ఈ గుంతలు పెద్ద విషయం కాదని వారు అనుకుంటున్నారు. అందుకే పట్టించుకోవడం లేదు. ఏపీలో ఎక్కడో ఓ రోడ్డును తాత్కలికంగా మరమ్మతులు చేసి పక్షి మీడియాలో … ఇక రయ్ .. రయ్ మని దూసుకుపోదాం అని.. పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారు. ఎన్నేళ్లయినా సేమ్ డైలాగ్ తో వార్త వస్తుంది. కానీ ఎన్నికలకు ముందూ సీన్ మారడం లేదు.
వైసీపీ రౌడీల చేతుల్లోకి లా అండ్ ఆర్డర్
ఏపీలో లా అండా ఆర్డర్ ఉందని ఒక్కరూ అనుకోవడం లేదు. బాధితుడు ఎవరూ పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని అనుకోవడం లేదు. అలాంటి ప రిస్థితి సృష్టించారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసి కొట్టిన వైసీపీ మనుషులపై కనీసం కేసులు పెట్టకపోవడమే దీనికి సంకేతం. ఇసుక దందాలో తేడాలొచ్చి.. కార్లు తగలబెట్టుకుంటే.. కేసులు ఉండవు. నేరస్తుల్ని పట్టుకుంటే వదిలేయమంటారు. ఇంకా కోపం వస్తే ఫిర్యాదు చేసిన వాళ్లనే లోపలేస్తారు. ఇలాంటి పోలీసింగ్ తో ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారో లెక్క లేదు. అయినా ఎవరికీ పట్టదు.
రోడ్డెక్కుతున్న విపక్షాలు – గళం కలుపుతున్న జనం
ప్రభుత్వ నిర్బంధాలను తట్టుకుని మరీ విపక్షాలు రోడ్డెక్కుతున్నాయి. వారికి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. గుంతల రాజ్యానికి దారేది అంటూ టీడీపీ, జనసేన ప్రారంభించిన ఉద్యమానికి విశేష స్పందన వచ్చింది. ఆదివారం మరింతగా హోరెత్తనుంది. ఏపీ రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని నినదించనున్నారు.