కోనేరు ప్రసాద్ అనే వైసీపీ పెద్ద మనిషి గుండెపోటుతో చనిపోయారు. ఆయన చక్కగా దుబాయ్ లో ఏదో వ్యాపారం చేసుకునేవారు. కానీ వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో దోచుకుందామని చెప్పి.. ఏపీకి తెచ్చారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ పేరుతో పెద్ద స్కాం చేశారు.
ఎమ్మార్ అనేది వైఎస్ హయాలో జరిగిన అతి పెద్ద క్విడ్ ప్రో కో స్కాముల్లో ఒకటి. భూములు కట్టబెట్టి ప్రభుత్వానికి రావాల్సిన వాటాను కూడా అడ్డగోలుగా తగ్గించి.. నిబంధనలు మార్చి.. ఆ సొమ్మును జగన్ రెడ్డి పెట్టుబడుల రూపంలో మళ్లించుకున్నారన్నారు. ఆ స్కాం అంతా నిజమని తేలింది. ప్రభుత్వానికి చెల్లించాల్సినది చెల్లించాల్సిందేనని ఎన్సీఎల్టీ తేల్చి చెప్పింది. గతంలో అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. గత ఏడాది జూలైలో ఎన్సీఎల్టీ తేల్చింది.
ఎమ్మార్ యజమానికి కోనేరు ప్రసాద్.. ఆయన కుమారుడు.. ఈ కేసులో నిండా మునిగిపోయారు, జైలుకెళ్లారు. కోనేరు ప్రసాద్ వైసీపీ తరపున విజయవాడ ఎంపీ సీటుకు కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సైలెంటయ్యారు. ఒకప్పుడు దుబాయ్ లో బాగా బతికిన కోనేరు ప్రసాద్ ను దోచుకుందామని తీసుకు వచ్చి జగన్ రెడ్డి అండ్ కో నట్టేట ముంచారు. ఫలితంగా ఆయన ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇంత జరిగినా ఆయన చనిపోతే.. వైసీపీ వైపు నుంచి కనీస సానుభూతి కూడా రాలేదు.
జగన్ రెడ్డిని నమ్ముని ఏది చేయాలనుకున్నా.. చేసినా చివరికి విషాదాంతం ఖాయమని..ఎన్నో ఉదంతాలు ఉన్నాయని.. కోనేరుప్రసాద్ ది అందులో ఒకటని ఆ పార్టీ నేతలే గుసగులాడుకుంటున్నారు.