రుషికొండను బోడిగుండు చేసి జగన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ ఖర్చు రూ. 433 కోట్లు. ఇంతకు ముందే దీని గురించి సమాచారం బయటకు వచ్చిన జీవోలు మాత్రం వెల్లడి కాలేదు. హైకోర్టు ఎక్కడ మొట్టికాయలు వేస్తుందోనని .. రహస్యంగా ఉంచిన జీవోలననీ ఇటీవల అప్ లోడ్ చేయడం ప్రారంభించారు. ఆదివారం పది జీవోలు విశాక రుషికొండ ఆపీసుకు సంబంధించి అప్ లోడ్ చేశారు. వీటిలో అంతా రహస్యంగా జరిగిన రుషికొండ ప్యాలెక్ కథ కొంత వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా వంద కోట్ల విలువైన టెండర్లను పిలవాలంటే న్యాయసమీక్షకు పంపాలి. అలా పంపితే బయటకు తెలుస్తుంది. అందుకే పనుల్ని వంద కోట్ల లోపు పునులుగా విడగొట్టి టెండర్లు పిలిచారు. ఎప్పుడు పిలిచారు.. ఎవరికి అప్పగించారో ఎవరికీ తెలియదు. పనులు మాత్రం పూర్తి చేసుకున్నారు. ఇలా రుషికొండకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేస్తే… అయిన ఖర్చు రూ. 433 కోట్లు. ఫర్నీచర్ కే 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. టాయిలెట్ కమోడ్ లకే రూ.లక్షలు ఖర్చుపెట్టారన్న ప్రచారం జరుగుతోంది. పెట్టిన ఖర్చును చూస్తే అది నిజమని స్పష్టమవుతోందని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు రూ. 433 కోట్లు అయ్యాయి కానీ పూర్తయ్యే సరికి ఐదు వందల కోట్లు దాటిపోవచ్చని అంచనా వేస్తున్నారు. జగన్ రెడ్డి తాను ఉండటం కోసం పర్యావరణ విధ్వంసం చేసి.. రుషికొండకు బోడిగుండ కొట్టి… ఐదు వందల కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోవడం.. అదీ కూడా ప్రతి పైసా ప్రజాధనమే కావడం ఇక్కడ అందర్నీ ఆశ్చర్య ప రుస్తోంది. పేదలకు ఇళ్ల పేరుతో సెంట్ స్థలాలిచ్చారు. వాటిలో ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి. కానీ జగన్ రెడ్డికి మాత్రం ఐదు వందల కోట్లతో ఇల్లు సమకూరింది.