హైదరాబాద్ శివార్లలో కార్లలో తరలిస్తున్న రూ. 7 కోట్ల 40 లక్షల రూపాయల వ్యవహారం కలకలం రేపుతోంది. పోలీసులు పట్టుకున్న రాజకీయ నేతల సొమ్ము నిఖార్సుగా ఇదొక్కటే అనుకోవచ్చు. ఎక్కడ్నుంచి తరలిస్తున్నారో తెలియదు కానీ..గమ్యం మాత్రం ఖమ్మం అని క్లారిటీ వచ్చింది. పక్కా సమాచారం అందడంతో పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీయడం ప్రారంభించారు. పది మందికి నోటీసులు ఇచ్చారు. ఇందులో ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి బంధువులు ఎక్కువగా ఉన్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి బడా కాంట్రాక్టర్. ఆయన చేసే పనులన్నీ ఏపీ ప్రభుత్వంలోనే. అక్కడ ఇసుక సీవరేజీ వసూలు చేసుకోడం సహా.. స్మార్ట్ మీటర్లు, ప్రాజెక్టులు .. చాలా కాంట్రాక్టులు వచ్చాయి. వాటిలో ఎన్ని పనులు చేస్తున్నారో తెలియదు కనీ … మొబిలైజేషన అడ్వాన్సులు మాత్రం తీసుకున్నారని అంటున్నారు. అ డబ్బులనే.. ఇలా ఎన్నికల్లో ఖర్చుల కోసం వాడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా కాకపోయినా ఏపీలో పెద్ద ఎత్తున ఇసుక, మద్యం విషయంలో మగదు వ్యవహారాలు జరుగుతాయి. నగదు అక్కడ అందుబాటులో ఉటుంది. అక్కడ్నుంచే తెలంగాణకు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు తెలంగాణ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్న ప్రచారం జరుగుతోది. పెద్దిరెడ్డి, చెవిరెడ్డి వంటి వారు.. .. కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఆర్థిక అవసరాలు తీరుస్తున్నారని అంటున్నారు. ఏపీ ప్రజల సొమ్ము పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయంలో కీలకం కావడం.. విశేషమే.