ఓ సినిమాలో పోసాని కృష్ణమురళి చిన్న కేసులో ఇరుక్కుంటాడు. మహా అయితే జరిమానాతో వదిలిపోయే కేసు అది. కానీ పోసాని తరపున సప్తగిరి రంగంలోకి దిగుతాడు. తీవ్రంగా వాదించి.. పోసానికి ఏకంగా ఉరిశిక్ష పడేలా చేస్తాడు. అంటే.. తాను వాదిస్తున్న వ్యక్తిపై కేసు.., సింపుల్ గా పోయే దాన్ని చినిగి చేటంత చేసి.. చేపంత చేసి .. ఉరిశిక్ష పడేలా చేస్తాడన్నమాట. ఆ సీన్ చూసి జనం అంతా పగలబడి నవ్వుకున్నారు. కానీ పోసాని పరిస్థితి ఏమిటి ?
నిజ జీవితంలో పోసాని క్యారెక్టర్ లో జగన్ రెడ్డి ఉన్నారు. సప్తగిరి క్యారెక్టర్ లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నారు. అసలేం జరిగిందంటే… చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టులో తీవ్రంగా వాదించిన ఏఏీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి…. పలు కేసులను ఉదహరించారు. అందలో జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఉంది. జగన్ రెడ్డి తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని.. ఇలాంటి వారికి బెయిల్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని కేసును ఉదహరించారు. ఇదే విషయాన్ని చంద్రబాబు బెయిల్ తీర్పులో న్యాయమూర్తి చెప్పారు. జగన్ కేసుల్లో ఆధారాలు ఉన్నాయి..చంద్రబాబు కేసులో ఆధారాలు లేవు.. ఈ చిన్న లాజిక్ ను మిస్సయిన పొన్నవోలు.. జగన్ రెడ్డి తీవ్ర ఆర్థిక నేరస్తుడని… హైకోర్టులోనే వాదించినట్లయింది.
జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు.. న్యాయవ్యవస్థలో ఓ బెంచ్ మార్క్ గా ఉన్నాయి. అలాంటి నేరాలు చేయడం.. వాటిని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలన్నదానిపై అంతర్జాతీయ సదస్సుల్లో కూడా మాట్లాడుతున్నారు. లా స్కూళ్లలో పాఠాలుగా కూడా మారాయి. ఎంత గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ…. పొన్నవోలు ఇలా తమ నేత గురంచి చెప్పడం మాత్రం.. వైసీపీ నేతల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కులపిచ్చితో కనీస అవగాహన లేని వాళ్లను… ఏఏజీలుగా పెట్టుకుంటే… ఇలాగే ఉంటుందని సెటైర్లు బయట వినిపిస్తున్నాయి.