ఏపీ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసింది. ఆ సొమ్మంతా ఏమయ్యింది. ప్రజలకు రెండున్నర లక్షల కోట్లు పంచానని జగన్ రెడ్డి చెబుతున్నారు. ఆయనచెప్పే లెక్క వేరు… జీతాలు ఇచ్చినా .. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసి వాళ్లకు డబ్బులిచ్చినా అది పంచినట్లుగానే చెప్పుకుంటారు. ఎంత పంచారో .. శ్వేతపత్రం మాత్రం విడుద ల చేయరు. ఈ విషయం పక్కన పెడితే… ఆ సొమ్మును నిజంగా రాష్ట్ర అవసరాల కోసం వాడి ఉంటే… ఈ పాటికి రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది.
ప్రజలకు పంచింది ఎంద ? అప్పు ఎంత ?
రూ. లక్ష కోట్లు పెట్టిఅమరావతి కట్టాల్నా… ఎట్టెట్టా అన్ని దుడ్లు ఎక్కడున్నాయని… ఆర్థిక మంత్రి బుగ్గన…. అరాచక సీఎం జగన్ రెడ్డిపదే చెప్పుకుంంటూ వస్తున్నారు. కానీ అప్పులు చేసిన వాటిని సమర్థంగా వినియోగించుకుంటే అమరావతి పూర్తయిపోయేది. నిజానికి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు . కట్టుకుంటూ పోతూంటే.. విలువ పెరిగి ఆటోమేటిక్ గా ఆదాయం వస్తుంది. కానీ కుప్పకూల్చడమే లక్ష్యం కాబట్టి.. అబద్దాలు చెబుతున్నారు. పోనీ పోలవరంకు అయినా ఖర్చు పెట్టారా అంటే అదీ లేదు. కేవలం రూ. 30వే ల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టి ఉంటే.. ఈ పాటికి పోలవరం పూర్తయ్యేది. రాయలసీమలో వర్షాలు పడకపోయినా కరువు ఉండేది కాదు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది.
పోలవరం, అమరావతి కట్టుకున్నా ఇంకా లక్షల కోట్లు మిగులు – ఎటు పోయాయి ?
ఏపీ ప్రజల్ని తాకట్టు పెట్టి చేసిన అప్పులన్నీ దారి మళ్లాయి. సంక్షేమ పథకాల పేరుతో పావలా పంచి.. ముప్పావలా దోచుకున్నారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచిపెట్టారు. అసలు వేల కోట్లు ఎటు పోయాయో తెలియని పరిస్థితి ఖజానాలో ఉందని చెబుతున్నారు. ఒక్క అధికారి మాత్రమే… ప్రస్తుతం… డబ్బుల వ్యవహారాలు చూస్తున్నారు. అతని దగ్గరే మొత్తం గుట్టుఉంది. ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. కానీ అసలు అప్పులు మాత్రం గుదిబండగానే ఏపీని వెంటాడనున్నాయి.
కళ్ల ముందు కనబడేది ప్యాలెస్ మాత్రమే !
ఇక్కడ కొసమెరుపేమింటంటే.. సీఎం జగన్ రెడ్డి తాను పరిపాలన చేయడానికి విశాఖ వెళ్లేందుకు ఐదు వందలకోట్లతో పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ ప్యాలెస్ కట్టుకున్నారు. పది లక్షల కోట్ల అప్పుల ో కాస్త కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి ఇదొక్కటే. అరబ్ రాజులు వాడే రాజభోగాలుఉండే.. ఈ ప్యాలెస్ తీర్చిద్దుకున్నారు. ప్రజలు పన్నులు కడితే… ఆయన రాజభోగాలు అనుభవిస్తారన్నమాట .