ఎన్నికలకు ఆరు నెలల ముందు శంకుస్థాపన చేస్తే దాన్ని మోసమంటారు అని జగన్ రెడ్డి హైపిచ్ లో చెప్పిన మాటలు నలువైపులా వినిపిస్తూండగానే … ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందుగానే ఇష్టం వచ్చినట్లుగా శంకుస్థాపనలు చేసుకుంటూ పోతున్నారు. వాటికి కనీసం టెండర్లు పిలవడం లేదు. కాంట్రాక్టులు ఇవ్వడం లేదు. మంగళవారం సుళ్లూరుపేటలో మత్స్యకారులకు సంబంధించిన పనికి శంకుస్థాపన చేస్తున్నారు. కానీ టెండర్లు పిలవలేదు.
అసలు టెండర్లు పిలవలేదు కాదు.. ఎవరూ రాలేదు. నాలగుు సార్లు టెండర్లు పిలిచినా ఒక్కరంటే ఒక్క కాంట్రాక్టర్ పని తీసకుకోలేదు. మేఘా వాళ్లతో… పొంగులేటి శ్రీనివాసరెడ్డికో చెప్పి.. ఆ పనులు తీసుకోవాలని … డబ్బులు వచ్చే ప్రభుత్వం ఇస్తుందని బాండ్ రాసిస్తామని కూడా చెప్పలేదు. ఎందుకటే అది చేయాలనుకోవలేదు. .ఒక వేళ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి పనులు చేస్తే వాళ్లకి డబ్బులు ఇవ్వరు. అందుకే ఎవరూ మందుకు రాలేదు. కానీ శంకుస్థాపన మాత్రం చేసేస్తున్నారు జగన్ రెడ్డి.
ఈ శంకుస్థాపలన్నీ ఎందుకయ్యా అంటే… అవే ఎన్నికల ప్రచార సభ లు. ప్రజాధనం ఖర్చు పెట్టి పార్టీని ఎలా నడుపుకోవాలో జగన్ రెడ్డి కి బాగా తెలుసని దీన్ని ద్వారా అర్థం చేసుకోవచ్చు. పార్టీ పేరుతో జిల్లాలో బహిరంగసభలు పెట్టలేక.. ప్రజాధనంతో పెడుతున్నారు. .పాంప్లెట్లు, జెండాలు సహా మొత్తం ప్రభుత్వ ఖర్చుతోనే పార్టీని నడిపిస్తున్నారు. అంటే జగన్ రెడ్డి తెలివి తేటలన్నీ ఆయన సొంత వ్యాపారాలకు , పార్టీ ఖర్చులు మిగుల్చుకోవడానికి ఉపోయగపడుతున్నాయి కానీ.. ప్రజలకు మాత్రం పెద్ద హోల్ పెడుతున్నాయి.